తీయనైన తెలుగుకు తెగులు పట్టించకండి
విధాత:తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటం తగదు.సంస్కృత భాష పట్ల మీకంత మక్కువుంటే కొత్తగా సంస్కృత అకాడమీని ఏర్పాటు చేయండంటూ విమర్శించారు సీపీఐ నేత రామకృష్ణ. వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రుల మాతృభాష తెలుగును విస్మరిస్తున్నది.పిల్లల చదువులలో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని చొప్పించేందుకు ప్రయత్నించింది.తెలుగు భాషను నిర్వీర్యం చేసే కుట్రలను ఖండిస్తున్నాం.తెలుగు అకాడమీని యథాతథంగా కొనసాగించాలి.మాతృభాష అభివృద్ధి కోసం తెలుగు అకాడమీకి తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ […]

విధాత:తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటం తగదు.సంస్కృత భాష పట్ల మీకంత మక్కువుంటే కొత్తగా సంస్కృత అకాడమీని ఏర్పాటు చేయండంటూ విమర్శించారు సీపీఐ నేత రామకృష్ణ.
వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రుల మాతృభాష తెలుగును విస్మరిస్తున్నది.పిల్లల చదువులలో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని చొప్పించేందుకు ప్రయత్నించింది.తెలుగు భాషను నిర్వీర్యం చేసే కుట్రలను ఖండిస్తున్నాం.తెలుగు అకాడమీని యథాతథంగా కొనసాగించాలి.మాతృభాష అభివృద్ధి కోసం తెలుగు అకాడమీకి తగినన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.