వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, బీఏ, బీఎస్సీ తదితర ప్రొఫెషనల్, నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు నిర్వహించే అన్ని యాజమాన్యాల్లోని డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలలో అక్టోబర్‌ 1వ తేదీనుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర (ఉన్నత విద్యాశాఖ) సోమవారం జీవో–242 విడుదల చేశారు. కోవిడ్‌ దృష్ట్యా సరి, బేసి విధానంలో అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రకటించారు. కోవిడ్‌కు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ) ప్రకారం తగు జాగ్రత్తలతో తరగతులు నిర్వహించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. […]

వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, బీఏ, బీఎస్సీ తదితర ప్రొఫెషనల్, నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు నిర్వహించే అన్ని యాజమాన్యాల్లోని డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలలో అక్టోబర్‌ 1వ తేదీనుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర (ఉన్నత విద్యాశాఖ) సోమవారం జీవో–242 విడుదల చేశారు. కోవిడ్‌ దృష్ట్యా సరి, బేసి విధానంలో అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రకటించారు. కోవిడ్‌కు స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌వోపీ) ప్రకారం తగు జాగ్రత్తలతో తరగతులు నిర్వహించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

  • నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల క్యాలెండర్‌ ఇలా (బేసి సెమిస్టర్లు)
  • కాలేజీల రీ ఓపెనింగ్‌: అక్టోబర్‌ 1, 2021
  • 1, 3, 5 సెమిస్టర్ల తరగతులు: అక్టోబర్‌ 1 నుంచి
  • 1, 3, 5, సెమిస్టర్‌ ఇంటర్నల్‌ పరీక్షలు: డిసెంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 6 వరకు
  • తరగతుల ముగింపు: జనవరి 22, 2022
  • సెమిస్టర్‌ పరీక్షల ప్రారంభం: జనవరి 24 నుంచి
  • నాన్‌ ప్రొఫెషనల్‌ కోర్సులు (సరి సెమిస్టర్లు)
  • 2, 4, 6 సెమిస్టర్ల తరగతుల ప్రారంభం: ఫిబ్రవరి 15, 2022
  • అంతర్గత పరీక్షలు: ఏప్రిల్‌ 4 నుంచి 9 వరకు
  • తరగతుల ముగింపు: మే 28, 2022
  • 2, 4, 6 సెమిస్టర్‌ పరీక్షలు: జూన్‌ 1, 2022 నుంచి
  • కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్టు: 2వ సెమిస్టర్‌ పరీక్షల అనంతరం 8 వారాలు
  • సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌/జాబ్‌ ట్రైనింగ్‌/అప్రెంటిస్‌షిప్‌: 4వ సెమిస్టర్‌ తరువాత 8 వారాలు
  • తదుపరి విద్యా సంవత్సరం ప్రారంభం: ఆగస్టు 9, 2022