బయట నుండి వచ్చే భక్తులకు అనుమతి లేదు:ఆర్డీవో మధుసూదన్
కోవిడ్ నిబంధనల మేరకే ఉత్సవాలు:అనంతపురం ఆర్డీవో మధుసూదన్. విధాత:శిoగనమల నియోజకవర్గంలోని గూగూడు శ్రీ కుల్లాయి స్వామి బ్రహ్మోత్స వాల నిర్వహణ పై ఆర్డీవో ఆదేశం.గూగూడు గ్రామ ప్రజలతో ఉత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాంప్రదాయ రీతిలో బ్రహ్మోత్సవాలను నిరాడంబరంగా చేపట్టేందుకు అధికారులు మరియు ఆలయ నిర్వాహకులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్డీవో ఆదేశించారు.ముఖ్యంగా కోవిడ్ నిబంధనల మేరకే ఈసారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని బయట నుండి వచ్చే భక్తులకు […]

కోవిడ్ నిబంధనల మేరకే ఉత్సవాలు:అనంతపురం ఆర్డీవో మధుసూదన్.
విధాత:శిoగనమల నియోజకవర్గంలోని గూగూడు శ్రీ కుల్లాయి స్వామి బ్రహ్మోత్స వాల నిర్వహణ పై ఆర్డీవో ఆదేశం.గూగూడు గ్రామ ప్రజలతో ఉత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సాంప్రదాయ రీతిలో బ్రహ్మోత్సవాలను నిరాడంబరంగా చేపట్టేందుకు అధికారులు మరియు ఆలయ నిర్వాహకులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆర్డీవో ఆదేశించారు.ముఖ్యంగా కోవిడ్ నిబంధనల మేరకే ఈసారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని బయట నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అనుమతులు ఉండవని స్పష్టం చేసిన ఆర్డీవో.కరోనా నేపథ్యంలో ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించి ప్రస్తుతం పరిమిత సంఖ్యలో కేవలం గూగూడు గ్రామస్తుల ఆధ్వర్యంలోనే ఈ బ్రహ్మోత్సవాలు జరగాలని సూచించాము. అనంతపురం ఆర్డీవో మధుసూదన్.