నలుగురు పోలీసుల మరణం మా పోలీస్ కుటుంబానికి తీరని లోటు
విధాత: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏఆర్ పోలీసులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందన్నారు డిజిపి గౌతమ్ సవాంగ్.కలకత్తా లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏఆర్ ఎస్‌ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లు,ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.తక్షణం ఘటనా స్థలాన్ని చేరుకొని వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రేంజి డిఐజి, జిల్లా ఎస్పీని ఆదేశించిన డిజిపి. ఘటనపై సమగ్ర […]

విధాత: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏఆర్ పోలీసులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందన్నారు డిజిపి గౌతమ్ సవాంగ్.కలకత్తా లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఏఆర్ ఎస్‌ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లు,ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.తక్షణం ఘటనా స్థలాన్ని చేరుకొని వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రేంజి డిఐజి, జిల్లా ఎస్పీని ఆదేశించిన డిజిపి.
ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.విధి నిర్వహణలో నలుగురు పోలీసుల మరణం మా పోలీస్ కుటుంబానికి తీరని లోటు.మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి,ప్రభుత్వం, పోలీస్ శాఖ వారి కుటుంబాలకు అండగా ఉంటుంది.