ఆటలు, క్రీడల వల్ల మానసికోల్లాసం లభిస్తుంది
విధాత: ఆటలు, క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా IPS, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS సంయుక్తంగా అభిప్రాయపడ్డారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియంలో పునరుద్ధరించిన బాస్కెట్ బాల్ కోర్టును ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డి.ఐ.జి, ఎస్పీలు మాట్లాడారు. ప్రస్తుతం చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు శారీరక శ్రమ లేకుండా చరవాణీలకు అతుక్కుపోవడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ […]

విధాత: ఆటలు, క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా IPS, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS సంయుక్తంగా అభిప్రాయపడ్డారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియంలో పునరుద్ధరించిన బాస్కెట్ బాల్ కోర్టును ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డి.ఐ.జి, ఎస్పీలు మాట్లాడారు. ప్రస్తుతం చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు శారీరక శ్రమ లేకుండా చరవాణీలకు అతుక్కుపోవడం వల్ల అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కొంత సేపు ఇలాంటి ఆటలు, క్రీడలకు ప్రాధాన్యం ఇస్తే ఆరోగ్యంతో పాటు ఆనందం లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి.టి.సి డిఎస్పీలు జె.మల్లికార్జునవర్మ, దేవదాస్ , టి.శ్రీనివాసులు, పి.టి.సి వైద్యాధాకారి ఆదిశేషు, పలువురు సి.ఐ లు, ఆర్ ఐ లు, ఎస్సై లు, ఆర్ ఎస్ ఐ లు, తదితరులు పాల్గొన్నారు.