25న ఆమెజాన్‌ ప్రైమ్‌లో దృశ్యం2

విధాత: అభిమానులు ఎప్పుడెప్పుడోస్తుందా అని ఎదురుచూస్తున్నరోజు రానే వచ్చింది. విక్టరీ వెంకటేశ్‌ హీరోగా గతంలో వచ్చిన దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా సురేశ్‌ ప్రోడక్షన్స్‌ నిర్మాణంలో దృశ్యం2 సినిమా నిర్మాణం పూర్తై చాలా రోజులైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అందరూ మొదటి చిత్రంలోని వారే నటించగా ఒరిజినల్‌ సినిమా మళయాళంలో దర్శకత్వం వహించిన జీతు జోసెఫ్‌ తెలుగులోను దర్శకత్వం వహించారు. ఇప్పటికీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న దృశ్యం2 సినిమా ట్రైలర్‌ను ఎట్టకేలకు విడుదల […]

25న ఆమెజాన్‌ ప్రైమ్‌లో దృశ్యం2

విధాత: అభిమానులు ఎప్పుడెప్పుడోస్తుందా అని ఎదురుచూస్తున్నరోజు రానే వచ్చింది. విక్టరీ వెంకటేశ్‌ హీరోగా గతంలో వచ్చిన దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా సురేశ్‌ ప్రోడక్షన్స్‌ నిర్మాణంలో దృశ్యం2 సినిమా నిర్మాణం పూర్తై చాలా రోజులైన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అందరూ మొదటి చిత్రంలోని వారే నటించగా ఒరిజినల్‌ సినిమా మళయాళంలో దర్శకత్వం వహించిన జీతు జోసెఫ్‌ తెలుగులోను దర్శకత్వం వహించారు.

ఇప్పటికీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న దృశ్యం2 సినిమా ట్రైలర్‌ను ఎట్టకేలకు విడుదల చేయగా అంతటా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఈ సినిమాను ఓటీటీ వేదికగా ఈ నెల 25న ఆమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయనున్నారు. కాగా మళయాళంలో మోమన్‌లాల్‌, మీనా జంటగా నటించిన దృశ్యం2 సినిమాను మళయాళంలోను ఓటీటీ వేదికగా విడుదల చేయగా మంచి విజయం సాధించింది. విమమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.