మానవ హక్కులు పరిరక్షణకు ప్రతిఒక్కరు పాటుపడాలి

విధాత‌ : ఎపి పోలీస్ సిఐడి విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ పి.వి. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా నివారణా దినోత్సవం సందర్భంగా మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో విర్చ్యుయల్ కన్వర్జెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అంధ్రప్రదేశ్ డిజిపి గౌతం సవాంగ్ పోస్టర్ ను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ మానవ హక్కులు పరిరక్షణకు విఘాతం కల్గించడం తో పాటు వారి శ్రమని తీవ్రంగా దోపిడీ చేయడంలో […]

మానవ హక్కులు పరిరక్షణకు ప్రతిఒక్కరు పాటుపడాలి

విధాత‌ : ఎపి పోలీస్ సిఐడి విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ పి.వి. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణా నివారణా దినోత్సవం సందర్భంగా మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో విర్చ్యుయల్ కన్వర్జెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అంధ్రప్రదేశ్ డిజిపి గౌతం సవాంగ్ పోస్టర్ ను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ మానవ హక్కులు పరిరక్షణకు విఘాతం కల్గించడం తో పాటు వారి శ్రమని తీవ్రంగా దోపిడీ చేయడంలో మానవ అక్రమ రవాణా ప్రధనమైన అంశం. మానవ హక్కులు పరిరక్షణకు ప్రతిఒక్కరు పాటుపడాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 స్పష్టంగా తెలియజేస్తుంది. కొంతమంది మధ్యవర్తులు, దళారీలు పేదరికం ఎదుర్కొంటున్న కుటుంబంలోని బాలికలను, మహిళలను ప్రలోభపెట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఉద్యోగ అవకాశాలు, టీవీ, సినిమా రంగాలలో అవకాశము ఇప్పిస్తామని, స్మార్ట్ ఫోన్లు ఆశగా చూపిస్తూ మాయమాటలుతో మభ్య పెట్టే ఒక ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు వివిధ రకాల అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించుకోవడానికి తరలిస్తూ ఉంటారు. కొంతమంది బాలురు, బాలికలను బాలకార్మికలుగా, వెట్టి చాకిరీ పనులకు మారుస్తున్నారు. అంతేకాకుండా అవయవ మార్పిడికి కూడా పిల్లలను ఉపయోగించి వారి శారీరక మానసిక ఎదుగుదలకు నష్టం కలిగించే విధంగా ఉపయోగిస్తున్నారని వాటన్నిటిని నిర్మూలించేందుకు సమిష్ఠిగా పోరాడాల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామంలోని ప్రతిఒక్కరి వివరాలను క్రోడీకరిoచుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియమించడం ద్వారా వ్యక్తులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించడం ద్వారా మానవ అక్రమ రవాణాను అడ్డుకట్ట వేసేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రత, రక్షణ కు సంబంధించి ప్రత్యేకంగా దిశ సంబంధిత కార్యక్రమాలు, స్పందన వంటి కార్యక్రమాలతోపాటు అనేక రకాలుగా మహిళలు తమ సమస్యలను విన్నవించుకోవడం, పరిష్కరించుకోవడం మరింత సులభతరం అయ్యింది. తద్వారా మానవ అక్రమ రవాణా నిరోధించడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మానవ అక్రమ రవాణా నివారణా చర్యలలో భాగంగా బాధితుల గుర్తింపు, బాధితుల కెంద్రీకృత విధానం, విక్టిమ్ జస్టీస్ అక్స్బిలిటీ ఉండాలని అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం G.O no : 47ను విడుదల చేసిందని దాని ద్వారా త్వరలోనే ప్రతీ జిల్లాలో ఒక్కక్క మానవ అక్రమ రవాణా యూనిట్ ను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, దిశ పోలీసు స్టేషన్ అధికారులు, దిశ రాజకుమారి, మహిళా శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ ప్రోజెక్ట్ డైరెక్టర్లు, ఓన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్, లేబర్ డిపార్ట్మెంట్ చెందిన డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు చెందిన సంబంధిత అధికారులు, రమేష్ కన్నెగంటి, రామ్ మోహన్, వాసవ్య మహిళా మండలి కీర్తి పాల్గొన్నారు.