తండ్రి కొడుకులు శవ రాజకీయాలు చేస్తున్నారు..ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
చంద్రబాబుది ఎప్పుడూ యాంటీ మైనార్టీ స్టాండే.. దిశ లాంటి చట్టం తీసుకురావాలని మీకు ఎందుకు అనిపించలేదు బాబూ..? ఒక్క మైనార్టీకైనా మంత్రి పదవి ఇచ్చారా బాబూ..? హజీరాబీ అనుమానాస్పద మృతిపై విచారణ జరుగుతోంది.. తప్పు జరిగితే నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టం ఏడాది తర్వాత తండ్రీకొడుకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుకు వచ్చారా? నంద్యాల యువకులపై గుంటూరులో దేశద్రోహం కేసులు పెట్టించింది బాబు కాదా..? దిశ చట్టం చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేయకపోగా,మంచి చేస్తున్న ముఖ్యమంత్రిపై విమర్శలా..? విధాత:అధికారంలో […]

- చంద్రబాబుది ఎప్పుడూ యాంటీ మైనార్టీ స్టాండే..
- దిశ లాంటి చట్టం తీసుకురావాలని మీకు ఎందుకు అనిపించలేదు బాబూ..?
- ఒక్క మైనార్టీకైనా మంత్రి పదవి ఇచ్చారా బాబూ..?
- హజీరాబీ అనుమానాస్పద మృతిపై విచారణ జరుగుతోంది.. తప్పు జరిగితే నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టం
- ఏడాది తర్వాత తండ్రీకొడుకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుకు వచ్చారా?
- నంద్యాల యువకులపై గుంటూరులో దేశద్రోహం కేసులు పెట్టించింది బాబు కాదా..?
- దిశ చట్టం చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేయకపోగా,మంచి చేస్తున్న ముఖ్యమంత్రిపై విమర్శలా..?
విధాత:అధికారంలో ఉండగా ఏనాడూ మైనార్టీలను పట్టించుకోని చంద్రబాబు నాయుడు..తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు శవ రాజకీయాలు చేస్తున్నారని కర్నూలు వైయస్సార్ సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు.కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రమడుగు గ్రామానికి చెందిన హజీరాబీ అనుమానాస్పద మృతి పట్ల ప్రభుత్వం అన్నికోణాల్లో విచారణ చేపట్టిందని తెలిపారు.హజీరాబీ మరణంపై విచారణ వేగంగా జరుగుతోందని, విచారణ పూర్తి కాగానే నిందితులు ఎంతటివారైనా శిక్ష పడుతుందని తెలిపారు. అయితే నారా లోకేష్ చావులను కూడా రాజకీయం చేస్తూ మైనార్టీలపై లేని ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మంగళవారం కర్నూలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో మైనార్టీలు, దళితులపై లెక్కలేనన్ని దాడులు జరిగాయి. ఈ విషయాన్ని నారా లోకేష్ తెలుసుకోవాలి. మీ నాయన అధికారంలో ఉన్పప్పుడు యాంటీ మైనార్టీ స్టాండ్ తీసుకున్న వారితో కలిసి ప్రభుత్వంలో పని చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో కూడా ఒక మైనార్టీ మంత్రి ఉంటే, అదే చంద్రబాబు మంత్రివర్గంలో ఒక్క మైనార్టీకి అయినా చోటు దక్కిందా? ఆ ఘనత మీ నాయనది,మీది కాదా లోకేష్? ముస్లిం మైనార్టీలపై మీకున్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
- హజీరాబీది హత్య అని తెలిసింది పోస్ట్‌మార్టం నివేదిక ద్వారానే. అయితే పొలం పనులకు వెళ్లిన ఆ అమ్మాయి సహజ మరణం పొందిందని, అంతకు ముందు ఆమె కుటుంబీకులు దహన సంస్కారాలు చేస్తుంటే.. పోలీసులు ఈ ఘటనపై పోస్ట్‌మార్టం జరగాల్సిందేనని పట్టుబట్టారు.ఆ పోస్ట్‌మార్టంలో సహజ మరణం కాదని,హత్య జరిగిందని తేలడంతో దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే విచారణలో కొంచెం ఆలస్యం జరిగినా కచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎవరైతే తప్పు చేశారో వారికి కఠినంగా శిక్ష కూడా పడుతుంది. క్లిష్టతరమైన ఈ కేసును పోలీసులు జాగ్రత్తగా విచారణ చేస్తుంటే మీరు శవ రాజకీయాలు చేస్తారా?
- ఇదే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మహిళలపై జరిగిన ఘోరాలు, నేరాలు అన్నీ ఇన్నీ కావు. చెప్పుకుంటూ పోతే పెద్ద చాంతాడే అవుతుంది. కానీ ఈరోజు స్వార్థ,నీచ రాజకీయాల చేస్తూ.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలపై టీడీపీ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారు. నారా లోకేష్ వెయిల్ లాస్ ప్రోగ్రామ్స్ పెడుతూ.. బిల్డప్ ఇస్తున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు అణగారిన వర్గాలను కించపరిచి,రాజకీయంగా, ఆర్థికంగా,సామాజికంగా తొక్కిపెట్టారు.గుంటూరు నారా హమారా సభలో మైనార్టీ యువకులు తమ హక్కుల కోసం పోస్టర్లు చూపించి అడిగినందుకు నంద్యాల యువకులపై దేశద్రోహం కేసులు పెట్టించింది మీరు కాదా..
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదు.నీ స్థాయిని తెలుసుకుని మాట్లాడేతే బాగుంటుంది. దిశ యాప్ గురించి తక్కువచేసి లోకేష్ మాట్లాడుతున్నాడు.దిశ యాప్ ప్రవేశపెట్టడం ద్వారా దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న దిశ చట్టం యొక్క తీరుతెన్నులను పరిశీలించి, ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా తీసుకువచ్చే ప్రయత్నం ఆయా రాష్ట్రాలు చేస్తున్నాయి. దిశ చట్టాన్ని చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి అడ్డగోలుగా మాట్లాడతారా? లోకేష్.. ఎమ్మెల్యేగా గెలవలేదు. సర్పంచ్ గా కూడా పోటీ చేయలేదు. ప్రజల్లో గెలవలేని లోకేష్ కు ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత ఎక్కడిది?.
- చంద్రబాబు కొడుకు లోకేష్ కు ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశాడు కానీ, అదే షరీఫ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయారు? నంద్యాల ఉప ఎన్నికలు వచ్చేవరకూ ఫారుఖ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు? మరి ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? ఒక్క మైనార్టీకైనా మంత్రి పదవి ఇచ్చారా చంద్రబాబూ? మీరు ఏరోజు అయినా మైనార్టీ ప్రజలు మంచిగా ఉండాలని ఆలోచన చేశారా? ఎంతసేపటికీ మైనార్టీలను మభ్యపెట్టి, వారి మైండ్ సెట్ ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు తప్పితే ఏరోజూ మంచి చేద్దామనే ఆలోచనే మీకు లేదు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతవిద్యను అందించేలా ముఖ్యమంత్రిగారు పని చేస్తున్నారు. స్కూళ్ల రూపురేఖలు మార్చి, విద్యార్థుల తలరాతలు మారేలా, భవిష్యత్‌లో సర్కారు స్కూళ్ళల్లో చదివిన వారంతా ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యేలా ఒక మహాత్తర కార్యక్రమం జరుగుతుంటే.. దాన్ని చూసి ఓర్చుకోలేక కుటిల రాజకీయాలు చేస్తున్నారు. నాడు-నేడు ద్వారా పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం తీసుకు వచ్చినందుకే కదా మీకు కడుపు మంట. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని డబ్బా కొట్టుకునే మీకు దిశ లాంటి చట్టం తీసుకురావాలని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా?
- జగనన్న ప్రభుత్వంలో మైనార్టీలకు సంపూర్ణంగా న్యాయం జరుగుతోంది. మంత్రివర్గం నుంచి మున్సిపల్ చైర్మన్ల వరకూ మైనార్టీలకు ప్రాతినిధ్యం లభించింది. చంద్రబాబుకు మైనార్టీలపై ఎప్పుడూ ప్రేమ లేదు కాబట్టే, వారిని అన్నివిధాలా తొక్కిపెట్టాడు. మీ హయాంలో మైనార్టీలకు చేసిన సంక్షేమం, అభివృద్ధిపై, రెండేళ్ల జగనన్న పాలనలో మైనార్టీ వర్గాలకు జరిగిన మేళ్ళపై చర్చకు మేము సిద్ధం, దమ్ము, ధైర్యం ఉంటే కర్నూలుకు నారా లోకేష్. ఇవాళ శవ రాజకీయాలు చేయడానికి ఇంతగా దిగజారాలా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాకే మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చింది. మరి మీ తొమ్మిదేళ్ల పాలనలో మైనార్టీలకు ఏం చేశారో చెప్పగలరా?
- దిశ యాప్ ఏం చేసిందని అడుగుతున్నారు. నోరు ఉంది కదా అని మాట్లాడితే అయిపోతుందా? దిశ యాప్‌పై ప్రధాని దగ్గర నుంచి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారు. మహిళలపై అత్యాచారాల కేసులను త్వరితగతిన విచారణ చేసి,శిక్షలు అమలు చేస్తున్నాం. కరోనా సమయంలో తండ్రీకొడుకులు ఎక్కడ దాక్కున్నారు? మీ నాయనేమో జూమ్ బాబా? నువ్వేమో వెయిట్ లాస్ కార్యక్రమంలో ఉన్నావ్. ఏడాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టించుకోని మీరు ఇప్పుడు చిల్లర రాజకీయాలు చేసేందుకు వస్తున్నారా?
- ఈ ప్రభుత్వం కులం, మతం, పార్టీ ఏంటనేది చూడదు. సంక్షేమ పథకాలకే కాకుండా.. ఏ విషయంలో అయినా అన్నివర్గాల వారికి ప్రభుత్వం సమ న్యాయం చేస్తుంది. అదే తప్పు జరిగితే నిందితులు ఎంతటి వారినైనా వదిలిపెట్టదు. ఈ విషయాన్ని నారా లోకేష్ గుర్తుపెట్టుకోవాలి. 2019లో మీ పార్టీని ప్రజలు ఎలా భూస్థాపితం చేశారో తెలుసు.ఇక రాబోయే రోజుల్లోనూ సేమ్ టూ సేమ్ జరుగుతుంది.