ఐదుగురు గురు పోలీసు అధికారుల సస్పెన్షన్
విధాత,కాకినాడ : చింతూరు సబ్ డివిజన్, ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ మరియు రామచంద్రాపురం సబ్ డివిజన్ అనపర్తి పోలీస్ స్టేషన్ ఎస్సై గా పనిచేసి ప్రస్తుతం ఏపీ ట్రాన్స్కో(విజిలెన్స్ విభాగం) ఎస్సైగా రాజమండ్రి నందు పనిచేయుచున్న ఎండీ. ఎమ్మార్.అలీఖాన్ ను విధుల నుండి తొలగిస్తూ ఏలూరు రేంజ్ డిఐజి కె.వి.మోహనరావు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ యమ్. రవీంద్రనాథ్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ ఉత్తర్వుల వెనుక నేపథ్యం ఎటపాక […]

విధాత,కాకినాడ : చింతూరు సబ్ డివిజన్, ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ గీతా రామకృష్ణ మరియు రామచంద్రాపురం సబ్ డివిజన్ అనపర్తి పోలీస్ స్టేషన్ ఎస్సై గా పనిచేసి ప్రస్తుతం ఏపీ ట్రాన్స్కో(విజిలెన్స్ విభాగం) ఎస్సైగా రాజమండ్రి నందు పనిచేయుచున్న ఎండీ. ఎమ్మార్.అలీఖాన్ ను విధుల నుండి తొలగిస్తూ ఏలూరు రేంజ్ డిఐజి కె.వి.మోహనరావు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ యమ్. రవీంద్రనాథ్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ ఉత్తర్వుల వెనుక నేపథ్యం ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టరుగా పనిచేసి ప్రస్తుతం జిల్లాలో విఆర్ లో ఉన్న యమ్.గీతా రామకృష్ణ, పోలీస్ శాఖ ద్వారా చింతూరు సబ్ డివిజనుకు కేటాయించబడిన క్రైమ్ స్పాట్ వెహికల్ గా ఉన్న సుజుకి ఎర్టిగా AP18P4850 వాహనానికి చెందిన నాలుగు టైర్లు తొలగించి తన సొంత వాహనం అయినా మారుతి ఎర్టిగా AP39B6152 కు ఏప్రిల్-2021 నెలలో భద్రాచలంలో మార్చుకొని వినియోగించుకోవడం ద్వారా తన యొక్క అధికారాలను దుర్వినియోగం చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు జిల్లా ఎస్పీ దృష్టికి రావడంతో వీటన్నింటిపై చింతూరు సబ్ డివిజనల్ అధికారి విచారణ జరిపి నివేదికను సమర్పించినట్లు ఎస్పీ తెలియజేశారు.
గత సార్వత్రిక ఎన్నికలు-2019 సందర్భంగా అనపర్తి పోలీస్ స్టేషన్ నందు జమ చేయబడిన 22 ప్రైవేట్ వ్యక్తులకు చెందిన లైసెన్స్ ఆయుధాలలో అనపర్తి గ్రామానికి చెందిన కర్రి దొరయ్య రెడ్డికి చెందిన డిబిబిఎల్-12 బోర్ భద్రపరచడం లో నిర్లక్ష్యంగా వ్యవహరించి నేటి వరకు ఆ ఆయుధం కనిపించకపోవడానికి కారణమైన అనపర్తి ఎస్సై. ఎండి. ఎమ్మార్.అలీఖాన్,
ఏఎస్సై. గురవయ్య(స్టేషన్ రైటర్),పీసీ 3688ఎస్కె.అబ్దుల్ దురాణి,(అసిస్టెంట్ రైటర్), పీసీ-3686 జె.వరప్రసాద్ (అసిస్టెంట్ రైటర్) లపై జిల్లా ఎస్పీ ఆదేశాలను అనుసరించి సబ్ డివిజన్ అధికారి విచారణ జరిపి నివేదిక ఇవ్వగా, ఆ నివేదిక ఆధారంగా నలుగురు పోలీసులపై ఏలూరు రేంజ్ డిఐజి సస్పెన్షన్ విధించినట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలియజేశారు.ఈ రెండు సందర్భాలలో ఐదుగురు పోలీసు అధికారులు అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం మరియు అవినీతి ఆరోపణలు ప్రాతిపదికన విధుల నుండి సస్పెన్షన్కు గురి అయినట్లు, తాను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న రోజు నుండి పోలీసు అధికారులు మరియు క్రింది
స్థాయి సిబ్బందికి పోలీస్ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని సూచించామని, ప్రజలకు పోలీస్ శాఖ పై నమ్మకం కలిగేలా అలసత్వం, అవినీతి, పక్షపాతం లను విడిచి నిబద్ధతతో పనిచేయాల్సిందిగా నిర్దేశం చేసినట్లు, ఆదేశాలకు విరుద్ధంగా విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై ఖచ్చితంగ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ బాబు తెలియజేశారు.