Garikapati : గరికపాటి గుడ్డు మాటలు గురి తప్పాయా..?
ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు తన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను తెలుగునాడుగా మార్చాలంటూ తన వ్యాఖ్యలతో రచ్చ రేపిన గరికపాటి తాజాగా విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వ్యాఖ్యలు మరో వివాదాన్ని రాజేశాయి.
విధాత, హైదరాబాద్ : ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు తన వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ను తెలుగునాడుగా మార్చాలంటూ తన వ్యాఖ్యలతో రచ్చ రేపిన గరికపాటి తాజాగా విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వ్యాఖ్యలు మరో వివాదాన్ని రాజేశాయి. మధ్యాహ్న భోజన పథకంలో పెట్టే గుడ్డుపైన, విద్యార్థులకు ప్రభుత్వాలు కల్పించే వసతులపైన చేసిన వ్యాఖ్యలు పేద వర్గ విద్యార్ధులను అవమానించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలకు తెరలేపాయి. గరికపాటి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ముంబై తెలుగు సమితి కార్యక్రమంలో తన ప్రసంగంలో గరికపాటి ప్రభుత్వ విద్యాసంస్థలలో మధ్యాహ్న భోజన పథకం అమలును తప్పుబడుతూ మాట్లాడారు. మధ్యాహ్న భోజన పథకం ముఖ్యమై చదువు మిధ్యాహ్నమైపోయిందన్నారు. చదువు ఎవరికి అక్కరలేకుండా పోయిందని, భోజనంలో గుడ్డు పెట్టారా..గాడిద గుడ్డు పెట్టారా అన్నదే ప్రధానమైపోయిందంటూ ప్రాసలో వ్యాఖ్యానించారు. కోడిగుడ్డు కోసం బడికి వస్తారా? అని, మాస్టార్లు గుడ్ల లెక్క రాయడంపైనే దృష్టి పెడుతూ చదువు చెప్పడంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఎన్ని గుడ్లు వెళ్లాయి..ఎన్ని మిగిలాయి..ఎన్ని మధ్యలో పేలాయి.. ఎన్ని గుడ్లు మాస్టర్ తినేశాడు ఈ లెక్కలపైనే దృష్టి పెట్టి చదువు చెప్పడం మానేశారన్నారు.
పిల్లలకు భోజనం పెట్టడం ఏమిటని..వారి భోజనం వాళ్లు తెచ్చుకోవాలని లేదంటే బడి మానేయాలంటూ వ్యాఖ్యానించారు. పిల్లలకు భోజనం పెట్టి, యూనిఫామ్ లు, పుస్తకాలు వంటివి అన్ని ఇస్తే..విద్యార్థి చదువు మానేసి శోభనం పెళ్లికొడుకులా మంచం ఎక్కి కూర్చుంటాడని చెప్పుకొచ్చారు. విద్యార్థికి ఇన్ని సౌకర్యాలు అవసరమా? ..చదువు రాకపోగా భోజనాలే వస్తున్నాయన్నారు. పైగా అందులో బల్లి, పిల్లి పడిందన్న వివాదాలు రేగుతున్నాయన్నారు. వంటల ఎజెన్సీల వారికి డబ్బులు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి ఆర్థిక భారమైపోతుందన్నారు. ప్రభుత్వం పని, కర్తవ్యం ఏమిటంటే..బాగా చదువు చెప్పడమే తప్ప.. పుస్తకాలు, బట్టలు ఇవ్వడం, అన్నం పెట్టడం కాదన్నారు. ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం..మీ జీవితానికి బాధ్యత వహిస్తాం..మీకు నమ్మకం ఉంటే బడికిరా లేకపోతో లేదు అని చెప్పే దమ్ము ఎవరికి లేదన్నారు. ఎందుకంటే మళ్లీ ఎన్నికలు వస్తాయి..మళ్లీ మనమే రావాలన్న ఆలోచనతో పాలకులు ఈ తరహా పథకాలు అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అయితే ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలపై గరికపాటి వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ దుమారం రేగుతుంది. గరికపాటి మాటలు.. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్, గురుకులాల్లో చదివే పేద విద్యార్థులను అవహేళన చేసేవిగా ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన గరికపాటి కుమారుడు తన తండ్రి వ్యాఖ్యలను వీడియో మార్ఫింగ్ తో వక్రీకరిస్తున్నారని వివరణ ఇచ్చారు. గరికపాటి గతంలో ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్ధులకు సహాయం చేయాలని చేసిన అభ్యర్థనలు ఈ సందర్బంగా గుర్తు చేస్తూ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.
గరికపాటి క్షమాపణ చెబుతారా? లేదా?
సోషల్ మీడియాలో ప్రవచనకర్త గరికపాటిపై తీవ్ర విమర్శలు
పిలల్లకు మధ్యాహ్న భోజన పథకంపై అహంకార మాటలు
పిల్లలకు పెట్టే గుడ్డును గాడిద గుడ్డా అంటూ వెకిలి మాటలు
శోభనం గదిలో పెళ్లికొడుకులా పిల్లలు భోజనం కోసం కూర్చుకుంటున్నార… pic.twitter.com/LPGM5SnbOf
— PulseNewsBreaking (@pulsenewsbreak) March 21, 2026
ఇవి కూడా చదవండి :
SLBC Tunnel : ఎస్ ఎల్బీసీ సొరంగం పనులు మళ్లీ షురూ!
తెలంగాణకు ప్రధాని మోదీ రాక.. గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram