కదులుతున్న రైల్లోనే.. పురుడు పోసిన వైద్య విద్యార్థిని
తల్లి, బిడ్డా క్షేమం, సంతోషం లో కుటుంబ సభ్యులు విధాత, హైదరాబాద్: ఆమె ఓ వైద్య విద్యార్థి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రైన్‌లో ప్రయాణం చేస్తుంది. ఆ వైద్య విద్యార్థి కూర్చున్న భోగిలోనే ఓ నిండు గర్భిణీ శ్రీకాకుళానికి ప్రయాణం చేస్తుంది. అయితే అనకాపల్లి సమీపంలోకి రాగానే ఆ గర్భిణీకి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. గమనించిన ఆ వైద్య విద్యార్థి వెంటనే ఆమె వద్దకు చేరుకొని దగ్గరుండి పురుడు పోసి ఆ తల్లి బిడ్డల ప్రాణం […]

తల్లి, బిడ్డా క్షేమం, సంతోషం లో కుటుంబ సభ్యులు
విధాత, హైదరాబాద్: ఆమె ఓ వైద్య విద్యార్థి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రైన్‌లో ప్రయాణం చేస్తుంది. ఆ వైద్య విద్యార్థి కూర్చున్న భోగిలోనే ఓ నిండు గర్భిణీ శ్రీకాకుళానికి ప్రయాణం చేస్తుంది. అయితే అనకాపల్లి సమీపంలోకి రాగానే ఆ గర్భిణీకి ప్రసవ నొప్పులు మొదలయ్యాయి.

గమనించిన ఆ వైద్య విద్యార్థి వెంటనే ఆమె వద్దకు చేరుకొని దగ్గరుండి పురుడు పోసి ఆ తల్లి బిడ్డల ప్రాణం కాపాడింది. ఆ బోగీలో ఉన్న తోటి ప్రయాణికులు ఆ వైద్య విద్యార్థికి అభినదనలు తెలిపారు. అప్పటి వరకు సుడులు తిరిగిన కన్నీళ్లతో ఉన్న ఆ గర్భిణీ కుటుంబ సభ్యులు కండ్ల వెంట ఆనంద భాష్పాలతో సంతోషంతో ఓ డాక్టరమ్మా నీకు వందనాలు తెలిపారు.

ప్రస్తుతం తల్లి,బిడ్డా క్షేమంగా ఉన్నారు. ప్రయాణంలో తల్లి బిడ్డలను కాపాడిన ఆ విద్యార్థినిని సోషల్ మీడియా వేదికగా అందరూ అభినందిస్తున్నారు. మంచి మనసున్న ఆ వైద్య విద్యార్థికి ‘విధాత’ కూడా వందనం చేస్తుంది.