రుయా ఘటనపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక
విధాత:తిరుపతి రుయాలో కరోనా రోగుల మరణాలపై దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.ఈ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం.. హైకోర్టుకు సమర్పించింది.ఈ కేసులో కౌంటర్ ఎందుకు వేయలేదని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 23 మంది మృతి చెందిన ఘటనపై.. కలెక్టర్ నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. సరఫరా ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లే ఆక్సిజన్ రాలేదని నివేదికలో పేర్కొంది. కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేయాలని […]

విధాత:తిరుపతి రుయాలో కరోనా రోగుల మరణాలపై దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.ఈ ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం.. హైకోర్టుకు సమర్పించింది.ఈ కేసులో కౌంటర్ ఎందుకు వేయలేదని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.
తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 23 మంది మృతి చెందిన ఘటనపై.. కలెక్టర్ నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. సరఫరా ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లే ఆక్సిజన్ రాలేదని నివేదికలో పేర్కొంది. కేసు నమోదు చేసి బాధ్యులను అరెస్టు చేయాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో నిర్లక్ష్యం వహించిన అంబులెన్స్ డ్రైవర్‌పై కేసు పెట్టారని గుర్తు చేశారు. ఈ కేసులో కౌంటర్ ఎందుకు వేయలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం 3 వారాల సమయం కోరగా.. ఆ తర్వాతే కేసును పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది.కరోనా రోగుల మరణానికి సంబంధించిన ఈ కేసులో తెలుగుదేశం నేత పి.ఆర్.మోహన్ పిల్ దాఖలు చేశారు.