భారత పురుషుల హాకీ జట్టును అభినందించిన గవర్నర్

విధాత,విజయవాడ:టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రశంసించారు.మ్యాచ్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడించి భారతదేశాన్ని గెలిపించిన జట్టు సభ్యులు అంతా అభినందనీయులన్నారు.ఇది ఒక చారిత్రాత్మక సందర్భమని ప్రస్తుతించిన గౌరవ గవర్నర్ 41 సంవత్సరాల విరామం తర్వాత హాకీ క్రీడలో ఒలింపిక్స్ వేదికగా పతకం అందుకోవటం శుభ పరిణామమని పేర్కొన్నారు.భారత పురుషుల హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచిందని,చాలా కాలం పాటు ఈ […]

భారత పురుషుల హాకీ జట్టును అభినందించిన గవర్నర్

విధాత,విజయవాడ:టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టును ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రశంసించారు.మ్యాచ్‌లో జర్మనీని 5-4 తేడాతో ఓడించి భారతదేశాన్ని గెలిపించిన జట్టు సభ్యులు అంతా అభినందనీయులన్నారు.ఇది ఒక చారిత్రాత్మక సందర్భమని ప్రస్తుతించిన గౌరవ గవర్నర్ 41 సంవత్సరాల విరామం తర్వాత హాకీ క్రీడలో ఒలింపిక్స్ వేదికగా పతకం అందుకోవటం శుభ పరిణామమని పేర్కొన్నారు.భారత పురుషుల హాకీ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో దేశానికి గర్వకారణంగా నిలిచిందని,చాలా కాలం పాటు ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ ప్రజలకు గుర్తుండి పోతుందని గవర్నర్ అన్నారు.ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.