గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు .. నారా లోకేష్
విధాత:జీవితంలో ఎదగడానికే కాదు, మన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో కూడా ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఉంటుంది. అటువంటి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుంటూ, గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కరోనా కారణంగా ఏపీలో చాలా మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయారు. కొందరు కూలీ పనులకు కూడా వెళ్తున్నారు. వారికి ఏ సాయమూ చేయలేదీ ప్రభుత్వం. ఇంకోవైపు చూస్తే మొదటి ఏడాదే […]

విధాత:జీవితంలో ఎదగడానికే కాదు, మన వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో కూడా ఉపాధ్యాయుల ప్రభావం చాలా ఉంటుంది. అటువంటి ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశసేవను స్మరించుకుంటూ, గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. కరోనా కారణంగా ఏపీలో చాలా మంది ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు ఉపాధి కోల్పోయారు. కొందరు కూలీ పనులకు కూడా వెళ్తున్నారు. వారికి ఏ సాయమూ చేయలేదీ ప్రభుత్వం. ఇంకోవైపు చూస్తే మొదటి ఏడాదే మెగా డీఎస్సీ అన్న పెద్దమనిషి ఇంతవరకు ఆ మాటే ఎత్తడం లేదు.

ఉపాధ్యాయులను గౌరవించి, పూజించే సంస్కారం ఈ ప్రభుత్వానికి ఎలాగూ లేదు. కనీసం వారికి ఆకలి బాధలు లేకుండా చేస్తే అదే పదివేలు. కరొనతో మృతి చెందిన ఉపాధ్యాయ కుటుంబాలకు పరిహారం ఏమిస్తారో కనీసం ఈ రోజైనా ప్రకటించండన్ని అన్నారు.