అంతర్జాతీయ ఎర్ర చందనం రవాణా ముఠా పట్టివేత
19 మంది అరెస్టు 3,305 కిలోల బరువున్న 165ఎర్రచందనం దుంగలు, 5వాహనాలు, 19 ఫోన్లు స్వాధీనం కడప, చిత్తూరు జిల్లాల నుండీ సేకరించి తమిళనాడు గోదాముల్లో నిల్వ తమిళనాడు గోదాముల నుంచి శ్రీలంక మీదుగా చైనాకు అక్రమ రవాణా విదేశాల్లో ఉంటూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులు విధాత: అంతర్జాతీయ ఎర్ర చందనం రవాణా ముఠాను హిందూపురం రూరల్ పోలీసులు రెడ్ హ్యాం డెడ్ గా పట్టుకున్నారు. ఈ ముఠాలోని 19 మంది […]

- 19 మంది అరెస్టు 3,305 కిలోల బరువున్న 165ఎర్రచందనం దుంగలు, 5వాహనాలు, 19 ఫోన్లు స్వాధీనం
- కడప, చిత్తూరు జిల్లాల నుండీ సేకరించి తమిళనాడు గోదాముల్లో నిల్వ
- తమిళనాడు గోదాముల నుంచి శ్రీలంక మీదుగా చైనాకు అక్రమ రవాణా
- విదేశాల్లో ఉంటూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులు
విధాత: అంతర్జాతీయ ఎర్ర చందనం రవాణా ముఠాను హిందూపురం రూరల్ పోలీసులు రెడ్ హ్యాం డెడ్ గా పట్టుకున్నారు. ఈ ముఠాలోని 19 మంది నిందితులను అరెస్టు చేశారు. 3,305 కిలోల బరు వున్న 165 ఎర్రచందనం దుంగలు, 5 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
కాగా వీటన్నింటి విలువ రూ.1.50 కోట్లు ఉంటుంది. కడప, చిత్తూరు జిల్లాల నుంచి సేకరించి తమి ళనాడు తిండివనం గోదాముల్లో నిల్వ చేయడం… అక్కడి నుంచి శ్రీలంక మీదుగా సముద్ర మార్గం లో చైనాకు అక్రమ రవాణా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈ ముఠాలో ఉన్న ఇద్దరు కీలక నిందితులు విదేశాల్లో ఉంటూ అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచంద నం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు తేలింది. మంగళవారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినె ల్లి IPS విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
విదేశాల్లో ఉన్న బావA-13సాహుల్ హమీద్ @ సాహుల్ తన బావమరిది A-12 బిలాల్ తో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని కడప, చిత్తూరు జిల్లాలలో విస్తారంగా ఉన్న పరిచయాలు చేసుకుని వారి ద్వారా ఎర్రచందనం చెట్లను కొట్టించి, వాటిని అక్ర మంగా తమిళనాడుకు తరలిస్తున్నాడు. అక్కడ నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు తరలిం చి అమ్ముకొని లాభాలు గడిస్తున్నాడు.
రెడ్ హ్యాండెడ్ గా పట్టివేత

జిల్లా మీదుగా కొనసాగే ఎర్రచందనం అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు ఆదేశాలు జారీ చేయడంతో సెబ్ అదనపు ఎస్పీ జె.రాంమోహనరావు పర్యవేక్షణలో పెనుకొండ డీఎస్పీ ఎన్ రమ్య ఆధ్వర్యంలో హిందూపురం రూరల్ సి.ఐ హమీద్ ఖాన్ , చిలమత్తూరు ఎస్సై రంగడు యాదవ్ మరియు సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు.
బెంగుళురు వైపు వెళ్తున్న ఐదు వాహనాలలో ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు తనిఖీలలో వెలుగు చూసింది. ఆరా తీయగా…ఎర్ర చందనము దుంగలను బద్వేలులో నిన్న లోడు చేయించి బెంగళూరు మీదుగా చెన్నైకి తరలిస్తూ పట్టుబడ్డారు.
అంతర్జాతీయ ఎర్ర చందన రవాణా ముఠాను చాకచక్యంగా పట్టుకొని భారీ మొత్తములో ఎర్ర చంద నం దుంగలను స్వాధీనం చేసుకొన్న హిందూపురము రూరల్ సర్కిల్ ససీఐ. హమీద్ ఖాన్, చిలమ త్తూరు యస్ఐ రంగడు యాదవ్, సిబ్బందిని ఎస్పీ డా. ఫక్కీరప్ప కాగినెల్లి IPS అభినందించారు.