క‌రోనా కేసుల‌ను మించిపోతున్న అక్ర‌మ కేసులు.. అచ్చెన్నాయుడు

విధాత‌(అమరావతి): రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల కంటే ప్రతిపక్ష నేతలపై నమోదవుతున్న అక్రమ కేసులే ఎక్కువని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అణచి వేయడానికి చూపిస్తున్న పట్టుదల ప్రజల ప్రాణాలను బలితీసుకొంటున్న కరోనా కట్టడిపై చూపడం లేదని విమర్శించారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర, ఇతర టీడీపీ నేతలపై గుంటూరు పోలీసులు తప్పుడు కేసు […]

క‌రోనా కేసుల‌ను మించిపోతున్న అక్ర‌మ కేసులు.. అచ్చెన్నాయుడు

విధాత‌(అమరావతి): రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల కంటే ప్రతిపక్ష నేతలపై నమోదవుతున్న అక్రమ కేసులే ఎక్కువని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అణచి వేయడానికి చూపిస్తున్న పట్టుదల ప్రజల ప్రాణాలను బలితీసుకొంటున్న కరోనా కట్టడిపై చూపడం లేదని విమర్శించారు.

మంత్రి సీదిరి అప్పలరాజుపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, కోవెలమూడి రవీంద్ర, ఇతర టీడీపీ నేతలపై గుంటూరు పోలీసులు తప్పుడు కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన వారిపైనే తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు పోలీసులు ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. ఇలా అయితే సామాన్య బాధితులు పోలీసు స్టేషన్‌కి రావాలంటేనే భయపడతారన్నారు.

పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యహహరిస్తూ వైసీపీ నేతలకు ఒక చట్టం, ప్రతిపక్ష నేతలకు మరో చట్టం అనుసరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలు చెప్పినట్లు ఆడుతూ టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులపై ముందు రోజుల్లో చర్యలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ నేతలపై నమోదు చేసిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.