కదిరి: కుప్ప కూలిన మూడంతస్తుల భవనం ఇద్దరు చిన్నారులు మృతి

విధాత‌: అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దారుణం జరిగింది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మూడు అంత స్తుల పాత భవనం కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా , శిథిలాల కింద 10 మంది చిక్కుకోగా శిథిలాల కింద నుంచి దంపతులను రెస్క్యూ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మూడు కుటుంబాలకు సంబంధించి తొమ్మిది మంది ఉన్నట్లు సమాచారం. కాగా మూడు అంతస్తుల పాత భవనం పక్కనున్న […]

కదిరి: కుప్ప కూలిన మూడంతస్తుల భవనం ఇద్దరు చిన్నారులు మృతి

విధాత‌: అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దారుణం జరిగింది తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మూడు అంత స్తుల పాత భవనం కూలిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా , శిథిలాల కింద 10 మంది చిక్కుకోగా శిథిలాల కింద నుంచి దంపతులను రెస్క్యూ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శిథిలాల కింద మూడు కుటుంబాలకు సంబంధించి తొమ్మిది మంది ఉన్నట్లు సమాచారం. కాగా మూడు అంతస్తుల పాత భవనం పక్కనున్న రెండు అంతస్తులు మరో ఇంటిపై పై కుప్ప కూలడంతో రెండు అంతస్తుల భవనం తో పాటు మరో ఇల్లు కూలిపోయింది.

ఘటన జరిగిన వెంటనే ఫైర్ ,పోలీస్ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఘ‌టనా ప్రదేశానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు జేసీబీ సహాయంతో శిథిలాలను తొలగి స్తున్నారు. అడిషనల్ ఎస్పీ నాగేంద్ర ఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాత భవనం గోడలు మెత్తబడి పక్కనున్న భవనంపై కూలి పోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. శిధిలాలను పూర్తిస్థాయిలో తొలగిస్తే ప్రాణ నష్టం అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.