ముగిసిన లోకేశ్ ఈడీ విచారణ.. రేపు మళ్లీ విచారణ

విధాత : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు లోకేశ్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. సీఐడీ ఇచ్చిన నోటీస్‌ల మేరకు తాను ఈ రోజు విచారణకు హాజరయ్యానన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుతో సంబంధం లేని అనేక ప్రశ్నలు అడిగారని, ఎలాంటి ఆధారాలు నా ముందు పెట్టలేదని, అయితే 50ప్రశ్నలు నాకు వేశారన్నారు. నాకు బుధవారం అనేక పనులు ఉన్నాయని, ఇంకా ఏదైనా అడుగాలనుకుంటే ఈ రోజే అడగండని చెప్పానన్నారు. అయితే సీఐడీ అధికారులు మాత్రం బుధవారం విచారణకు రావాలంటు అక్కడే తనకు 41ఏ కింద నోటీస్‌లు అందించారన్నారు.
ఈ రోజు వచ్చినట్లుగానే బుధవారం కూడా విచారణకు వస్తానన్నారు. ఈ రోజు విచారణలో ఇన్నర్ రింగ్ రోడ్డులో నేను, నా కుటుంబం ఏ విధంగా లాభపడిందన్నదానిపై ఒక్క ప్రశ్న కూడా వేయలేదన్నారు. నేను ఇప్పటికే చెప్పినట్లుగా ఇది ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగా పెట్టిన అక్రమ కేసులేనన్నారు. దొంగ ఎఫ్‌ఐఆర్‌లతో జగన్ ప్రభుత్వం టీడీపీ నేతలను వేధించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.