విధాత : ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి జియో మైసూర్ సంస్థ తయారు చేసిన స్వచ్చమైన బంగారం బిస్కట్లు బహిరంగ మార్కెట్ లో అమ్మకాలకు వచ్చేశాయి. ‘మేడిన్ జొన్నగిరి’ పేరుతో బులియన్ మార్కెట్లోకి వచ్చిన బంగారం బిస్కెట్ల కొనుగోలుకు కొనుగోలుదారుల నుంచి మంచి డిమాండ్ వస్తుందని జ్యువెలరీ యజమానులు చెబుతున్నారు. జొన్నగిరి గోల్డ్ బిస్కట్ లపై జియో మైసూర్, ఆంధ్రప్రదేశ్ పేరు, మ్యాప్,జొన్నగిరి మైన్ ఫ్లాంట్ చిత్రం, జొన్నగిరి మైన్ పేరును ముద్రించారు. 999గోల్డ్ (24 క్యారెట్లు)ను 500, 100గ్రాముల బిస్కెట్లుగా మార్కెట్ లోకి విడుదల చేశారు.
కర్నూలులోని ప్రముఖ దుకాణాల్లో లభిస్తున్న జొన్నగిరి బంగారం బిస్కెట్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. బంగారంపై సహజంగా ఉండే మమకారంతో పాటు మన బంగారం, మంచి బంగారం అన్న ప్రాంతీయ అభిమానంతో కొనుగోలుదారులు జొన్నగిరి బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని బంగారం దుకాణం దారులు చెబుతున్నారు. ఇన్నాళ్లు ఇతర దేశాల బంగారం కొనుగోలు చేశామని..ఇప్పుడు మేడిన్ ఆంధ్ర గోల్డ్ ప్రపంచ దేశాలలో వినిపించనుందని ఏపీ వాసులు జొన్నగిరి బంగారం ఉత్పత్తులను గర్వంగా భావిస్తున్నారు. జొన్నగిరి బంగారం ఉత్పత్తితో నవ్యాంధ్ర నిజంగానే స్వర్ణాంధ్రగా మారిపోయిందని, జొన్నగిరి స్వర్ణగిరిగా రూపాంతరం చెందనుందని స్థానికులు సంబర పడుతున్నారు.
🔥 బులియన్ మార్కెట్లోకి ‘మేడిన్ జొన్నగిరి’ బంగారం…
కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతంలో ఉత్పత్తి అయిన స్వచ్ఛమైన బంగారం ‘మేడిన్ జొన్నగిరి’ పేరుతో బులియన్ మార్కెట్లోకి వచ్చింది….
ఈ బంగారు బిస్కెట్లపై ఏపీ మ్యాప్‌ను ముద్రించారు….
కర్నూలులోని ప్రముఖ దుకాణాల్లో లభిస్తున్న ఈ… pic.twitter.com/IgXMegxM0f
— 𝗧𝗚/𝗔𝗣 𝗕𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗡𝗲𝘄𝘀 (@EVinay96) June 26, 2026
