శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబం
విధాత: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎప్పుడు స్వామి వారి దగ్గరకు వచ్చినా కోరుకున్నట్టుగానే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన దిగ్విజయంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు. శ్రీవారి దర్శనంలో మంత్రి మేకపాటి ఆయన సతీమణి […]

విధాత: పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎప్పుడు స్వామి వారి దగ్గరకు వచ్చినా కోరుకున్నట్టుగానే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన దిగ్విజయంగా కొనసాగాలని స్వామివారిని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు. శ్రీవారి దర్శనంలో మంత్రి మేకపాటి ఆయన సతీమణి శ్రీకీర్తి, కుమారుడు అర్జున్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.