మంత్రి వెలంప‌ల్లి తండ్రి మృతికి మేకపాటి సంతాపం

విధాత‌(అమరావతి): దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు తండ్రి వెలంప‌ల్లి సూర్య‌నారాయ‌ణ‌(80) ఆకస్మిక మృతి పట్ల పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి సహా ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి గౌతమ్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తండ్రి లేని లోటు తీర్చలేనిదని, మంత్రి వెలంపల్లి తన పితృ వియోగాన్ని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని […]

మంత్రి వెలంప‌ల్లి తండ్రి మృతికి మేకపాటి సంతాపం

విధాత‌(అమరావతి): దేవాదాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు తండ్రి వెలంప‌ల్లి సూర్య‌నారాయ‌ణ‌(80) ఆకస్మిక మృతి పట్ల పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి సహా ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి గౌతమ్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తండ్రి లేని లోటు తీర్చలేనిదని, మంత్రి వెలంపల్లి తన పితృ వియోగాన్ని తట్టుకునే ధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని వేడుకుంటున్నట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు.

దేవులపల్లి అమర్ సంతాపం
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు తండ్రి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్. మంత్రి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.