అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీ కి మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం ఫిర్యాదు

విధాత‌: నెల్లూరు జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ‌ష్టు 15వ తేదీన ప్రజాప్ర‌తినిధుల‌ను జెండా వంద‌న కార్య‌క్ర‌మానికి పిల‌వ‌లేద‌ని ఆనం రాంనారాయ‌ణ రెడ్డి ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. రాతపూర్వకంగా దీనిపై ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు. దీనిపై విచారించిన అసెంబ్లీ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఇతర సభ్యులు ఆనం రాంనారాయ‌ణ రెడ్డి ఫిర్యాదును నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో […]

అసెంబ్లీ ప్రివిలేజ్ క‌మిటీ కి మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం ఫిర్యాదు

విధాత‌: నెల్లూరు జిల్లా అధికారులకు ప్రజాప్రతినిధులంటే లెక్క లేకుండా వ్యవహరిస్తున్నారని ఆగ‌ష్టు 15వ తేదీన ప్రజాప్ర‌తినిధుల‌ను జెండా వంద‌న కార్య‌క్ర‌మానికి పిల‌వ‌లేద‌ని ఆనం రాంనారాయ‌ణ రెడ్డి ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. రాతపూర్వకంగా దీనిపై ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని దీనిపై విచారణ జరపాలని ఆయన కోరారు.

దీనిపై విచారించిన అసెంబ్లీ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఇతర సభ్యులు ఆనం రాంనారాయ‌ణ రెడ్డి ఫిర్యాదును నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో పూర్తిస్థాయిలో ప‌రిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజా ప్రతినిధులను జండా వందనానికి పిలవకపోవడంను సీరియ‌స్ గా ప‌రిగ‌ణించాల్సిన అంశ‌మేనని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి వ్యాఖ్యానించారు