పట్టాభి వెంటనే క్షమాపణ చెప్పాలి
విధాత: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి వెంటనే క్షమాపణ చెప్పాలని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పట్టాభి ఇవాళ మరింత దిగజారి సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టాభి టిడిపి లో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే తప్పుపట్టారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు […]

విధాత: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి వెంటనే క్షమాపణ చెప్పాలని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పట్టాభి ఇవాళ మరింత దిగజారి సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టాభి టిడిపి లో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే తప్పుపట్టారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి హెచ్చరించారు.