ఒక్క కంపెనీ కూడా బిడ్‌ వేయలేదు: సింఘాల్‌

విధాత:కరోనా వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రం ఇచ్చిన కోటా సరిపోవడం లేదని, త్వరితగతిన వ్యాక్సిన్‌ వేయాలనే ఉద్దేశంతో గ్లోబల్‌ టెండర్లు పిలిచామని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రీబిడ్‌ సమావేశంలో పాల్గొన్నప్పటికీ ఒక్క కంపెనీ కూడా బిడ్‌ దాఖలు చేయలేదని, ఇవాళ సాయంత్రంతో బిడ్‌ దాఖలుకు సమయం ముగిసిందని వెల్లడించారు. మిగిలిన రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా బిడ్‌ దాఖలు సమయాన్ని మరో రెండు వారాలు పొడిగించేందుకు సిద్ధమేనని, […]

ఒక్క కంపెనీ కూడా బిడ్‌ వేయలేదు: సింఘాల్‌

విధాత:కరోనా వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రం ఇచ్చిన కోటా సరిపోవడం లేదని, త్వరితగతిన వ్యాక్సిన్‌ వేయాలనే ఉద్దేశంతో గ్లోబల్‌ టెండర్లు పిలిచామని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రీబిడ్‌ సమావేశంలో పాల్గొన్నప్పటికీ ఒక్క కంపెనీ కూడా బిడ్‌ దాఖలు చేయలేదని, ఇవాళ సాయంత్రంతో బిడ్‌ దాఖలుకు సమయం ముగిసిందని వెల్లడించారు.

మిగిలిన రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా బిడ్‌ దాఖలు సమయాన్ని మరో రెండు వారాలు పొడిగించేందుకు సిద్ధమేనని, అప్పుడు కూడా ఫార్మా కంపెనీలు బిడ్లు దాఖలు చేస్తాయా లేదా అనేది వేచి చూడాలి అని వ్యాఖ్యానించారు. అందుకే ఈ వ్యాక్సిన్ల కొనుగోలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కేంద్రీకృతంగా జరగాలన్నదే సీఎం జగన్‌ అభిప్రాయమని పేర్కొన్నారు. కేంద్రం అనుమతిచ్చిన కంపెనీలు వ్యాక్సిన్‌ సరఫరా కోసం ముందుకు వస్తే మంచిదని, త్వరిత గతిన వ్యాక్సిన్‌ ప్రక్రియ ముగించి కొవిడ్‌ను నియంత్రించవచ్చని అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అన్నారు.