పీసీఏ చైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు
అమరావతి: ఏపీలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ)ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఎస్‌ఈసీగా నియామకం అయిన కనగరాజ్ ఊహించని పరిణామాలతో హైకోర్టు అదేశంతో పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మళ్లీ రిటైర్డ్ జడ్జికి సముచిత గౌరవం ఇవ్వాలని భావించిన జగన్ సర్కార్.. పోలీసులపై ఫిర్యాదులను విచారించే పీసీఏను ఏర్పాటు చేశారు. పోలీసులు న్యాయం చేయకపోయినా, […]

అమరావతి: ఏపీలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ (పీసీఏ)ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది ఎస్‌ఈసీగా నియామకం అయిన కనగరాజ్ ఊహించని పరిణామాలతో హైకోర్టు అదేశంతో పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మళ్లీ రిటైర్డ్ జడ్జికి సముచిత గౌరవం ఇవ్వాలని భావించిన జగన్ సర్కార్.. పోలీసులపై ఫిర్యాదులను విచారించే పీసీఏను ఏర్పాటు చేశారు. పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయిన, సకాలంలో న్యాయం లభించక పోయినా ప్రజలు పీసీఏను ఆశ్రయించవచ్చు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏని ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ అథారిటీలు ఏర్పాటయ్యాయి. తెలంగాణలో సైతం ఈ ఏడాది జనవరిలో పీసీఏను ఏర్పాటు చేశారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని చైర్మన్‌గా నియమించాలని సుప్రీం కోర్టు నిబంధన పెట్టింది. పీసీఏలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌తోపాటు ఒక స్వచ్ఛంధ సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి సభ్యులుగా వుంటారు. తమకు అందే ఫిర్యాదులపై పీసీఏ విచారణ చేసి బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. పీసీఏ సిఫారసులను సర్కార్ కచ్చితంగా అమలు చేయాలా వద్ద అనేది ప్రభుత్వ నిర్ణయిస్తుంది. పీసీఏకు సంబంధించి ఆదివారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
Readmore:ఏపీలో పోలీస్ కంప్లైంట్ అథారిటీ