ఒడిశా పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయ ప్రసాద్

విధాత‌,విశాఖ‌: మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత మళ్ల విజయప్రసాద్‌ను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక నేరాలకు సంబంధించి 2019లో మళ్ల విజయప్రసాద్‌పై ఒడిశాలో కేసు నమోదైంది.ఈ కేసు విచారణలో భాగంగా మళ్ల విజయప్రసాద్‌ను ఒడిశా సీఐడీ,నేరవిభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మళ్ల విజయప్రసాద్‌ను విశాఖ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు.మేజిస్ట్రేట్‌ అనుమతితో విజయప్రసాద్‌ను ఒడిశా తీసుకెళ్లారు. కాగా, ప్రస్తుతం రాష్ట్ర విద్యారంగ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ముళ్ల […]

ఒడిశా పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే మళ్ళా విజయ ప్రసాద్

విధాత‌,విశాఖ‌: మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత మళ్ల విజయప్రసాద్‌ను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక నేరాలకు సంబంధించి 2019లో మళ్ల విజయప్రసాద్‌పై ఒడిశాలో కేసు నమోదైంది.ఈ కేసు విచారణలో భాగంగా మళ్ల విజయప్రసాద్‌ను ఒడిశా సీఐడీ,నేరవిభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మళ్ల విజయప్రసాద్‌ను విశాఖ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు.మేజిస్ట్రేట్‌ అనుమతితో విజయప్రసాద్‌ను ఒడిశా తీసుకెళ్లారు. కాగా, ప్రస్తుతం రాష్ట్ర విద్యారంగ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ముళ్ల విజయప్రసాద్‌ ఉన్నారు.