తాళాలకోసం బెంజ్ కారుని త‌గ‌ల‌బెట్టిన య‌జ‌మాని

విధాత‌:ఇన్సూరెన్స్ కోసం ఏకంగా కారుపై పెట్రోల్ పోసి తగులపెట్టాడు యజమాని. ఈ సంఘటన రెంటచింతల మండలం రెంటాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రవీంద్రారెడ్డి పదకొండు నెలల క్రితం బెంజ్ కారు కొనుగోలు చేసాడు. అయితే డ్రైవర్ కారు తాళాలు పోగొట్టాడు. తాళాలను షోరూమ్‎లో వెతికిన దొరకకపోవడంతో సెకండ్ హ్యాండ్ తాళం కూడా దొరకలేదు. దీంతో కారును తగులబెడితే ఇన్సురెన్స్ వస్తుందని స్నేహితుల ద్వారా సలహా తీసుకున్నాడు. ఈ నెల 18న పెదకాకాని వద్దకు కారును తరలించి […]

తాళాలకోసం బెంజ్ కారుని త‌గ‌ల‌బెట్టిన య‌జ‌మాని

విధాత‌:ఇన్సూరెన్స్ కోసం ఏకంగా కారుపై పెట్రోల్ పోసి తగులపెట్టాడు యజమాని. ఈ సంఘటన రెంటచింతల మండలం రెంటాలలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రవీంద్రారెడ్డి పదకొండు నెలల క్రితం బెంజ్ కారు కొనుగోలు చేసాడు. అయితే డ్రైవర్ కారు తాళాలు పోగొట్టాడు. తాళాలను షోరూమ్‎లో వెతికిన దొరకకపోవడంతో సెకండ్ హ్యాండ్ తాళం కూడా దొరకలేదు. దీంతో కారును తగులబెడితే ఇన్సురెన్స్ వస్తుందని స్నేహితుల ద్వారా సలహా తీసుకున్నాడు. ఈ నెల 18న పెదకాకాని వద్దకు కారును తరలించి కారుపై యజమాని రవీంద్రారెడ్డి పెట్రోల్ పోసాడు. తన స్నేహితుడు కారుకు నిప్పు పెట్టాడు. నిప్పంటించిన వెంటనే కారులోంచి ఒక్కసారిగా మంటలు రావడంతో నాగరాజుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి.. ముగ్గురినీ అరెస్ట్ చేసి పెదకాకాని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు