వైసీపీది దౌర్భాగ్యపు… దిక్కుమాలిన… దాష్టిక పాలన
విధాత: ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా పరిషత్ ఎన్నికల్లో బలంగా పోరాడాం… 25.2% ఓట్లు సాధించాం.నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ వైసీపీ అరాచకాలు చేస్తుంటే అధికార యంత్రాంగం చోద్యం చూసింది.జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా మారుతోందన్నారు పవన్ కళ్యాణ్.పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు మరోసారి అభినందనలు తెలియజేశారు. దాడులు, బెదిరింపులతో వైసిపి నేతలు పాలన చేస్తున్నారు. వారి దాష్టిక పాలను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించుకున్నాం.వారి దాడులను ఎలా […]

విధాత: ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా పరిషత్ ఎన్నికల్లో బలంగా పోరాడాం… 25.2% ఓట్లు సాధించాం.నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ వైసీపీ అరాచకాలు చేస్తుంటే అధికార యంత్రాంగం చోద్యం చూసింది.జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా మారుతోందన్నారు పవన్ కళ్యాణ్.పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు మరోసారి అభినందనలు తెలియజేశారు.
దాడులు, బెదిరింపులతో వైసిపి నేతలు పాలన చేస్తున్నారు. వారి దాష్టిక పాలను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించుకున్నాం.వారి దాడులను ఎలా ఎదుర్కోవాలి… క్షేత్రస్థాయి పోరాటాలకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో మా నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తాం.ఇక నుంచి ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ప్రజల పక్షాన నిలబడతాం.ప్రతిపక్షాలను ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా బెదిరింపులు, దాడులకు పాల్పడింది.ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు బలంగా నిలిచారు.
ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమై… మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచులు, 1576 ఉపసర్పంచులు, 4456 వార్డు సభ్యులు గెలిచాం.అలాగే నిన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది 1200 స్థానాలు. గెలుపొందింది 177.పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 24 శాతం పైచిలుకు ఓట్ల శాతం సాధిస్తే…పరిషత్ ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఫలితాలు గొప్ప మార్పునకు సూచనగా భావిస్తున్నాం.
ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి ఓటు వేయకపోతే ఫించన్ నిలిపివేస్తాం,రేషన్ కట్ చేయిస్తాం, ఇళ్ల స్థలాలు నిలిపివేస్తామంటూ వాలంటీర్లతో బెదిరించారు.ఇతర పార్టీల అభ్యర్ధుల ఆర్థిక మూలలపై దాడులు చేశారు.మరి కొన్నిచోట్ల స్వయంగా మంత్రులే ఎన్నికల ప్రక్రియను నడిపించడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ నిలబడిపోయింది.పొత్తులో భాగంగా మిత్రపక్షమైన బీజేపీకి కొన్ని స్థానాలు కేటాయించాం.దానివల్ల కూడా జనసేనకు కొద్దిగా ఎంపీటీసీ సీట్లు తగ్గాయి. లేకుంటే ఇంకాస్త ఎక్కువ స్థానాలే వచ్చేవి.
అన్ని చోట్ల ఎంపీటీసీ అభ్యర్ధులు బరిలో లేకపోవడం జెడ్పీటీసీ అభ్యర్ధులకు ప్రతికూలంగా మారింది.అలాగే ఎన్నికల నాటికి జనసేన పూర్తిస్థాయి కమిటీలు లేకపోవడం కూడా చిన్న లోటుగా అనిపించింది. పోలీసులే బలవంతంగా విత్ డ్రా చేయించారు,ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన పరిస్థితులు వేరు. ఈ రోజు పరిస్థితులు వేరు. ఇప్పుడుగానీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే జనసేన పార్టీ కచ్చితంగా 1500 పైచిలుకు ఎంపీటీసీ స్థానాలు, 40 నుంచి 80 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకునేదని పరిశీలకులు చెబుతున్నారు.
ఇవాళ గెలుపొందిన వారిలో అన్ని కులాల వారు ఉన్నారు.సామాన్యులు గెలుపొందడం ఆనందాన్ని ఇచ్చింది.ఇంతటి విజయానికి ముఖ్యకారకులైన జనసైనికులు, వీరమహిళలకు ధన్యవాదాలు.వీరే లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేదే కాదు.మీ ధైర్యానికీ, తెగింపునకు సెల్యూట్ అని వెల్లడించారు.