గల్లా ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలని హైకోర్టులో పిటిషన్
విధాత: భూముల విక్రయ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు గల్లా ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకునేలా ఏపీఐఐసీని ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లా నల్లగట్లపల్లికి చెందిన జి.పురుషోత్తంనాయుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ. దుర్గాప్రసాదరావు … వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఐఐసీ సీఎండీ, ఏపీఐఐసీ ప్రాంతీయ మేనేజరు, గల్లా ఫుడ్స్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేశారు.కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను […]

విధాత: భూముల విక్రయ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినందుకు గల్లా ఫుడ్స్ లిమిటెడ్ సంస్థకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకునేలా ఏపీఐఐసీని ఆదేశించాలని కోరుతూ చిత్తూరు జిల్లా నల్లగట్లపల్లికి చెందిన జి.పురుషోత్తంనాయుడు హైకోర్టులో పిటిషన్ వేశారు.
పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ. దుర్గాప్రసాదరావు … వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఐఐసీ సీఎండీ, ఏపీఐఐసీ ప్రాంతీయ మేనేజరు, గల్లా ఫుడ్స్ లిమిటెడ్‌కు నోటీసులు జారీ చేశారు.కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు.