ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ బియ్యం పంపిణి..?
విధాత: సత్తెనపల్లి పట్టణంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపుతోంది.జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న పీలా చంద్రకళ అనే విద్యార్థినికి జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా బియ్యం ఇచ్చారు.ఇందులో ప్లాస్టిక్ బియ్యం ఆనవాళ్లు బయటపడ్డాయి.వెంటనే చంద్రకళ తండ్రి సాంబశివరావు ప్రధానోపాధ్యాయురాలు ఎల్ ఏసు మణికి ఫిర్యాదు చేశారు.చిన్నారులకు ఇచ్చే బియ్యంలో కల్తీ జరగటం పట్ల విధ్యార్ధిని తండ్రి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం,బిజెపి నాయకులు పోట్ల ఆంజనేయులు,గన్నమనేని శ్రీనివాసరావు,కోమటనేని శ్రీనివాసరావు,రావిపాటి మధుబాబు, […]

విధాత: సత్తెనపల్లి పట్టణంలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపుతోంది.జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న పీలా చంద్రకళ అనే విద్యార్థినికి జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా బియ్యం ఇచ్చారు.ఇందులో ప్లాస్టిక్ బియ్యం ఆనవాళ్లు బయటపడ్డాయి.వెంటనే చంద్రకళ తండ్రి సాంబశివరావు ప్రధానోపాధ్యాయురాలు ఎల్ ఏసు మణికి ఫిర్యాదు చేశారు.చిన్నారులకు ఇచ్చే బియ్యంలో కల్తీ జరగటం పట్ల విధ్యార్ధిని తండ్రి సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం,బిజెపి నాయకులు పోట్ల ఆంజనేయులు,గన్నమనేని శ్రీనివాసరావు,కోమటనేని శ్రీనివాసరావు,రావిపాటి మధుబాబు, ఎల్ రవి,బియ్యాన్ని ప్రజలు పరిశీలించారు. ఆ బియ్యాన్ని నానబెట్టిన కొద్దిసేపటికి… రైస్‌పైకి తేలింది. పట్టుకోని చూడగా… బంకలాగా సాగుతున్నాయి.వారు మాట్లాడుతూ..వీటిని తింటే పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపే ఇలాంటి బియ్యం పంపిణీదారులపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాంచ్ చేసారు.
అయితే తాము ప్రభుత్వం ఇచ్చిన బియ్యమే సరఫరా చేసినట్లు ప్రధానోపాధ్యాయురాలు ఎల్ ఏసు మణి చెబుతున్నారు.ఇప్పటివరకు ఈ విషయంపై ఎటువంటి సమాచారం లేదని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని చెప్పారు.