పోలీస్ అంటే కరుకుదనం కాదు..నమ్మకం-ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
విధాత:పోలీస్ అంటే ప్రజల్లో కనిపించే కరుకుదనం మాత్రమే కాదు,సమస్య తలెత్తితే నిలువరించే సమయస్ఫూర్తి.అనే ఒక నమ్మకం ఉంది. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే క్షణం మాత్రం ఆలస్యం చేయకుండా వెనువెంటనే ఆశ్రయించేది పోలీస్ శాఖ నే. అలాంటి పోలీస్ వ్యవస్థ లో పనిచేసే సిబ్బంది మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలంటే నిరంతర శిక్షణ అవసరమని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ అన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు సహాయకారిగా ఉండే ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ విభాగంలో […]

విధాత:పోలీస్ అంటే ప్రజల్లో కనిపించే కరుకుదనం మాత్రమే కాదు,సమస్య తలెత్తితే నిలువరించే సమయస్ఫూర్తి.అనే ఒక నమ్మకం ఉంది. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే క్షణం మాత్రం ఆలస్యం చేయకుండా వెనువెంటనే ఆశ్రయించేది పోలీస్ శాఖ నే. అలాంటి పోలీస్ వ్యవస్థ లో పనిచేసే సిబ్బంది మరింత ఉత్సాహంగా విధులు నిర్వర్తించాలంటే నిరంతర శిక్షణ అవసరమని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ అన్నారు.

శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు సహాయకారిగా ఉండే ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి శారీరక వ్యాయామం, అన్ని రకాల ఆయుధాల యొక్క పనితీరు, ఉపయోగాలు, స్క్వార్డ్ డ్రిల్ మొదలైన అంశాలపై మచిలీపట్నం ఏఆర్ పెరేడ్ గ్రౌండ్ నందు శిక్షణ అందిస్తున్నారు.

వీటివలన సిబ్బందిలో క్రమశిక్షణ భరితమైన విధి నిర్వహణ అలవరుచుకొని, నిరంతర కవాతు వలన ఆరోగ్యంగా ఉండటమే కాక, శారీరిక సమస్యలు మానసిక సమస్యలు కూడా దూరమవుతాయని, నిరంతర నేర్చుకోవడం వలన వీరి యొక్క సామర్థ్యం మరింత మెరుగు పడుతుందని, మానసికోల్లాసం పెంపొందుతుందని, నిరంతర వీధులతో సిబ్బంది ఒకరికొకరు దూరంగా ఉంటారు కనుక ఈ డ్రిల్ వలన అందరూ ఒకచోట కలవడంతో వారి మధ్య స్నేహ సంబంధం పెరిగి, ఒకరికొకరు సమన్వయం కలిగి ఉంటారని, అధికారులతో కూడా పరస్పర సంబంధం పెరుగుతుందని ఎస్పీ తెలియజేశారు.

అంతేకాక రాబోవు పంద్రాగస్టు వేడుకలకు సిబ్బంది మరింత నిబద్ధత క్రమశిక్షణ భరితంగా కవాతు సాధన చేస్తున్నారు.
