గుంటూరులోని గుంతలల్లో వరి నాట్లు నాటిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.!

విధాత:గత ప్రభుత్వం హయాంలో వేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడా రోడ్లపై రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.రాష్ట్రంలో రోడ్లు ప్రయాణానికి వీలు లేకుండా తయారయ్యాయి.సంక్షేమం పేరిట అభివృద్ధిని విస్మరించారన్నారు.గతంలో బిల్లులు చెల్లించకపోవడంతో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదని ప్రత్తిపాటి అన్నారు.బిల్లులు చెల్లిస్తే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుందన్నారు.సంక్షేమం పేరుతో ప్రభుత్వం సంక్షోభం సృష్టిస్తోందన్నారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు డొల్లతనంగా ఉన్నాయని సంక్షేమం కంటే ప్రజలపై వేసే […]

గుంటూరులోని గుంతలల్లో వరి నాట్లు నాటిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.!

విధాత:గత ప్రభుత్వం హయాంలో వేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడా రోడ్లపై రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.రాష్ట్రంలో రోడ్లు ప్రయాణానికి వీలు లేకుండా తయారయ్యాయి.సంక్షేమం పేరిట అభివృద్ధిని విస్మరించారన్నారు.గతంలో బిల్లులు చెల్లించకపోవడంతో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రావడం లేదని ప్రత్తిపాటి అన్నారు.బిల్లులు చెల్లిస్తే ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుందన్నారు.సంక్షేమం పేరుతో ప్రభుత్వం సంక్షోభం సృష్టిస్తోందన్నారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు డొల్లతనంగా ఉన్నాయని సంక్షేమం కంటే ప్రజలపై వేసే పన్ను భారమే ఎక్కువగా ఉందని ప్రత్తిపాటి పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.