Pulasa fish | గోదావరికి పులసొచ్చింది.. వలకు చిక్కిన కేజిన్నర చేప.. ధర ఎంత పలికిందంటే..!

Pulasa fish | గోదావరికి వరద నీరు వచ్చిందంటే చాలు పులస చేపల సందడి మొదలవుతుంది. అందుకే వరదల సీజన్‌లో పులుస చేప ఎప్పుడొస్తుందా..? అని భోజన ప్రియులు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం గోదావరికి ఎర్రనీరు వస్తుండటంతో పులస చేపలు వస్తుంటాయి. తాజాగా ఒక పులస చేప మత్స్యకారుల వలకు చిక్కింది.

Pulasa fish | గోదావరికి పులసొచ్చింది.. వలకు చిక్కిన కేజిన్నర చేప.. ధర ఎంత పలికిందంటే..!

Pulasa fish : గోదావరికి వరద నీరు వచ్చిందంటే చాలు పులస చేపల సందడి మొదలవుతుంది. అందుకే వరదల సీజన్‌లో పులుస చేప ఎప్పుడొస్తుందా..? అని భోజన ప్రియులు ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం గోదావరికి ఎర్రనీరు వస్తుండటంతో పులస చేపలు వస్తుంటాయి. తాజాగా ఒక పులస చేప మత్స్యకారుల వలకు చిక్కింది.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని వశిష్ట గోదావరిలో మలికిపురం మండలం రామరాజులంక గంగపుత్రుల వలలో సుమారు కేజీన్నర బరువున్న ఒక పులస చేప పడింది. ఆ గ్రామ మాజీ సర్పంచి బర్రే శ్రీను రూ.24 వేలు పెట్టి ఆ చేపను కొనుగోలు చేశారు. పులస చేపకు మాంసం రుచి అమోఘంగా ఉంటుందట. అందుకే దానికి ఎంత ఖరీదైనా కొనుగోలు చేస్తారు.