రాట్నాలమ్మ వారిని దర్శించుకున్న పీవీ సింధు

విధాత‌:ప.గో.జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని శ్రీ రాట్నాలమ్మ వారిని దర్శించుకున్న టోక్యో ఒలింపిక్ కాంస్యపతాక విజేత P V సింధు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ,అభినందించిన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి.ఈ కార్యక్రమంలో పివి సింధు మాట్లాడుతూ ఒలింపిక్స్ కి వెళ్లేముందు రాట్నాలమ్మ వారిని దర్శించుకుని వెళ్లాను. అమ్మవారి ఆశీస్సులు మరియు మీ అందరి యొక్క ఆశీస్సులు వల్లనే కాంస్య పతకాన్ని గెల్చుకున్నా అంటూ జరగబోయే ఒలింపిక్స్ లో మరెన్నో […]

రాట్నాలమ్మ వారిని దర్శించుకున్న పీవీ సింధు

విధాత‌:ప.గో.జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని శ్రీ రాట్నాలమ్మ వారిని దర్శించుకున్న టోక్యో ఒలింపిక్ కాంస్యపతాక విజేత P V సింధు. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ,అభినందించిన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి.
ఈ కార్యక్రమంలో పివి సింధు మాట్లాడుతూ ఒలింపిక్స్ కి వెళ్లేముందు రాట్నాలమ్మ వారిని దర్శించుకుని వెళ్లాను. అమ్మవారి ఆశీస్సులు మరియు మీ అందరి యొక్క ఆశీస్సులు వల్లనే కాంస్య పతకాన్ని గెల్చుకున్నా అంటూ జరగబోయే ఒలింపిక్స్ లో మరెన్నో పతకాలు పొందాలని అమ్మవారిని కోరుకున్నాన‌ని అందరికీ ధన్యవాదాలు తెలిపింది..