ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి హైకోర్టులో ఊరట
విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి హైకోర్టులో ఊరట లభించింది. నీలం సాహ్ని నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. సీఎం సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నీలం సాహ్నిపై రాజకీయపార్టీ ప్రభావం ఉంటుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నియామకం జరిగిందని కోర్టుకి తెలిపారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం ఎస్‌ఈసీగా నీలం సాహ్ని […]

విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి హైకోర్టులో ఊరట లభించింది. నీలం సాహ్ని నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. సీఎం సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. నీలం సాహ్నిపై రాజకీయపార్టీ ప్రభావం ఉంటుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నియామకం జరిగిందని కోర్టుకి తెలిపారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకం కరెక్టేనని తీర్పు వెలువరించింది.