ధూళిపాళ్ల నరేంద్ర కుమార్కు దేవాదాయ శాఖ నోటీసులు
విధాత:గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని వడ్లమూడి సంగం డైరీ ప్రాంగణంలో ఉన్న ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టు వివరాలు అందజేయాలని…దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్,దుర్గ గుడి ఈవో భ్రమరాంబ ప్రాథమిక విచారణ నోటీసు.ట్రస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పది రోజుల్లో అందజేయాలని మేనేజింగ్ ట్రస్టీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్కు నోటీసు పంపారు. దేవాదాయ శాఖ చట్టం నిబంధనల ప్రకారం వివరాలు అడిగినట్లు నోటీసులో పేర్కొన్నారు.ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆస్తుల వివరాలు, భూమికి సంబంధించిన […]

విధాత:గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని వడ్లమూడి సంగం డైరీ ప్రాంగణంలో ఉన్న ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టు వివరాలు అందజేయాలని…దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్,దుర్గ గుడి ఈవో భ్రమరాంబ ప్రాథమిక విచారణ నోటీసు.ట్రస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను పది రోజుల్లో అందజేయాలని మేనేజింగ్ ట్రస్టీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్కు నోటీసు పంపారు.
దేవాదాయ శాఖ చట్టం నిబంధనల ప్రకారం వివరాలు అడిగినట్లు నోటీసులో పేర్కొన్నారు.ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆస్తుల వివరాలు, భూమికి సంబంధించిన వివరాలు, ట్రస్టు కార్యకలాపాలు, ట్రస్ట్ డీడ్ కు సంబంధించిన వివరాలు అందజేయాలన్నారు.
2018-19 నుంచి ఇప్పటి వరకు మూడేళ్లకు సంబంధించిన ట్రస్టు ఆదాయ, వ్యయ వివరాలు, ఆదాయపు పన్ను మినహాయింపు పత్రాలను అందజేయాలని నోటీసులో తెలిపారు.విచారణ అనంతరం సమగ్ర వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.