బిసిలలో ఉన్న చిన్న కులాలనుంచి నాయకత్వం తయారుకావాలి
విధాత:బిసిలలో అభివృద్ది చెందిన కులాలే కాక వెనకబాటుకు గురైన కులాలను కూడా ప్రోత్సహించి వారిని చైతన్యపరచాలనే దిశగా వైయస్ జగన్ ధృడసంకల్పంతో ఉన్నారని వైయస్సార్ కాంగ్రె్స పార్టీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సగర-ఉప్పర కులస్ధుల ఆత్మీయ సమావేశం తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగింది. సమావేశానికి సగర-ఉప్పర కార్పోరేషన్ ఛైర్మన్ గానుపెంట రమణమ్మ శీనయ్య అధ్యక్షత వహించారు. సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ దశాభ్దాలుగా […]

విధాత:బిసిలలో అభివృద్ది చెందిన కులాలే కాక వెనకబాటుకు గురైన కులాలను కూడా ప్రోత్సహించి వారిని చైతన్యపరచాలనే దిశగా వైయస్ జగన్ ధృడసంకల్పంతో ఉన్నారని వైయస్సార్ కాంగ్రె్స పార్టీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సగర-ఉప్పర కులస్ధుల ఆత్మీయ సమావేశం తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగింది. సమావేశానికి సగర-ఉప్పర కార్పోరేషన్ ఛైర్మన్ గానుపెంట రమణమ్మ శీనయ్య అధ్యక్షత వహించారు. సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ దశాభ్దాలుగా బిసిలను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకుందని అన్నారు. వారిని వృత్తి పరంగా ప్రోత్సహిస్తున్నామనే పేరుతో సాంప్రదాయ పనిముట్లను అరకొరగా పంపిణి చేశారని అన్నారు. ఆధునిక ప్రపంచం వైపుగా వారిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఆలోచన రాలేదని అన్నారు. చంద్రబాబు బిసిలు మాట్లాడేందుకు వస్తే తోకలు కత్తిరిస్తామంటూ హేళనగా మాట్లాడేవారన్నారు. చంద్రబాబు బిసిలకు చేసిన ద్రోహాన్ని గుర్తించి 2019 ఎన్నికలలో బిసిలందరూ వైయస్సార్ కాంగ్రెస్ కు అండగా నిలిచారన్నారు. బిసిల కులాల్లో కొన్ని వెనకబడిన కులాలను గుర్తించి వారిలో కూడా నాయకత్వాన్ని ప్రోత్సహించాలని జగన్ సంకల్పించారని తెలిపారు. దానిలో భాగంగా తొలుత వీటికి సంబంధించి 100 కార్పోరేషన్ లను ఏర్పాటు చేయాలని భావించారని అయితే అనేక చర్చల తర్వాత వాటిని 56 గా ఏర్పాటుచేశారన్నారు. కార్పోరేషన్లంటే కుర్చీలు, టేబుల్స్ హంగులు ఆర్బాటాలు కాదని ఆయా బిసి కులాల సమస్యల పరిష్కార వేదికలుగా గుర్తించాలని అన్నారు. కార్పోరేషన్ల గురించి హేళనగా మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిదని అన్నారు. ముఖ్యంగా బిసిలలో ఇక్కడ సమావేశాలకు హాజరయ్యేవారు ముందు కుల నేతలని అయితే వారు ప్రాధమికంగా వైయస్సార్ కాంగ్రెస్ నేతలని గుర్తించుకోవాలని అన్నారు. వారిలో నుంచే భవిష్యత్తులో ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి జగన్ తయారుచేస్తారని అన్నారు.
బిసి సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బిసిలను అక్కున చేర్చుకుని వారికి నామినేటెడ్ పదవులలోను, వర్క్స్ లోను రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైయస్ జగన్ దేనని అన్నారు. బిసిల భవిష్యత్తు కోసం ఇంతగా పాటుపడుతున్న వైయస్ జగన్ కు అందరూ అండగా నిలవాలని కోరారు.
శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ నాలుగు రాజ్యసభ స్ధానాలు ఖాళీలు వస్తే రెండు స్ధానాలను బిసిలకు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి దేనని అన్నారు. బిసిలు అన్ని రంగాలలో ముందంజ వేయాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారని వివరించారు.
సమావేశంలో శాసనమండలి సభ్యులు దువ్వాడ శ్రీనివాస్, గోవిందరెడ్డి నవరత్నాలు అమలు కమిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అంకం రెడ్డి నారాయణ మూర్తి, సగర-ఉప్పర కుల సంఘం నాయకులు,పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు