సీఎం జగన్ సాంప్రదాయ బద్ధమైన నాయకుడు కాదు…సజ్జల
విధాత:దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా బిసిల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి.గత నాయకులు బలహీనవర్గాలను ఓటుబ్యాంకుగా చూస్తే…బలహీనవర్గాల ఎదుగుదల కోసం మన నాయకుడు కృషి చేస్తున్నారన్నారు ప్రభుత్వ సలహాదారుసజ్జాల రామకృష్ణ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కొత్త తరహా నాయకుడు… సంప్రదాయ బద్ధమైన నాయకుడు కాదు.సంప్రదాయ బద్దమైన రాజకీయాలు చేసి లబ్ది కోసం కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం చూసే నాయకుడు.కొంతమంది చేయలేని పనులను మన నాయకుడు చేస్తుంటే రాజకీయ శూన్యంతో ఆరోపణలు చేస్తూ, పిచ్చిరాతలు రాస్తున్నారు. ఇలాంటి […]

విధాత:దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా బిసిల ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి.గత నాయకులు బలహీనవర్గాలను ఓటుబ్యాంకుగా చూస్తే…బలహీనవర్గాల ఎదుగుదల కోసం మన నాయకుడు కృషి చేస్తున్నారన్నారు ప్రభుత్వ సలహాదారుసజ్జాల రామకృష్ణ రెడ్డి.
జగన్మోహన్ రెడ్డి కొత్త తరహా నాయకుడు… సంప్రదాయ బద్ధమైన నాయకుడు కాదు.సంప్రదాయ బద్దమైన రాజకీయాలు చేసి లబ్ది కోసం కాకుండా భావితరాల భవిష్యత్తు కోసం చూసే నాయకుడు.కొంతమంది చేయలేని పనులను మన నాయకుడు చేస్తుంటే రాజకీయ శూన్యంతో ఆరోపణలు చేస్తూ, పిచ్చిరాతలు రాస్తున్నారు.
ఇలాంటి దుష్పచారాలను మనమందరం కలిసి తిప్పికొట్టాలి.మన ముఖ్యమంత్రి బిసిలోని 139 కులాలకు గొప్ప అవకాశం కల్పించారు.ఈ అవకాశం ఉపయోగించుకొని సామజికంగా,రాజకీయంగా ఎదగాలి మిమ్మల్ని ఓటు బ్యాంకుగా చూసే వారికి మీ ఎదుగుదలే సమాధానంగా మారాలి అని మన నాయకుడి ఆకాంక్ష.బిసి కార్పొరేషన్ చైర్మన్లు,డైరెక్టర్లు వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని కోరుకుంటున్నాను.