నెల్లూరుకు సోనూసూద్ స్నేహహస్తం

విధాత‌: ఆపద సమయంలో ఎప్పుడు తానున్నానంటూ అందించే రియల్ హీరో సోనూ సూద్ మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. భారీ వర్షాలు వరదల ధాటికి నెల్లూరు జిల్లా అతలాకుతలం కావడంతో పాటు పలువురు పేద ప్రజలు నష్టపోవడంతో సోనూసూద్ తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి సుమారు 1500 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందజేయాలన్న ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆమేరకు నిత్యవసర వస్తువులను నెల్లూరు జిల్లాకు […]

నెల్లూరుకు సోనూసూద్ స్నేహహస్తం

విధాత‌: ఆపద సమయంలో ఎప్పుడు తానున్నానంటూ అందించే రియల్ హీరో సోనూ సూద్ మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. భారీ వర్షాలు వరదల ధాటికి నెల్లూరు జిల్లా అతలాకుతలం కావడంతో పాటు పలువురు పేద ప్రజలు నష్టపోవడంతో సోనూసూద్ తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నెల్లూరు జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి సుమారు 1500 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు అందజేయాలన్న ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆమేరకు నిత్యవసర వస్తువులను నెల్లూరు జిల్లాకు పంపనున్నారు. శనివారం పంపిణీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని సోనూసూద్ మిత్రులు సమీర్ ఖాన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాతో పాటు తిరుపతి కి కూడా సోనూసూద్ సహాయం చేయనున్నారు. నెల్లూరు జిల్లాకు ఇటీవల ఆక్సిజన్ ప్లాంట్ అందించిన సోనూసూద్ వరదల్లో సహాయం లో మరోసారి తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకు రావడం ఆయన ఉదారతకు అద్దం పడుతోంది..