త్వరలో ఏపీఎస్‌ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు..మంత్రి పేర్ని నాని

విధాత:ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం సైతం ఉందని, త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు.బుధవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న […]

త్వరలో ఏపీఎస్‌ ఆర్టీసీలో కారుణ్య నియామకాలు..మంత్రి పేర్ని నాని

విధాత:ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం సైతం ఉందని, త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు.
బుధవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి అడిగి తెలుసుకొని ఎన్నో సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే తక్షణ పరిష్కారం చూపించారు.

అనంతపూర్, కర్నూల్, తూర్పు గోదావరి, కర్నూల్, కడప, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ఆర్టీసీ కారుణ్య నియామక అభ్యర్థులు పలువురు మంత్రిని కలిసి తమ కష్టాలను ఏకరువు పెట్టారు. తమ తండ్రులు, భర్తలు ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో అకాల మృత్యువు పాలయ్యారని, గత కొంత కాలంగా కారుణ్య నియామకాలు లేకపోవటంతో తాము ఎంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.కొన్నేళ్లుగా ఈ నియామకాల కోసం ఎదురుచూస్తున్నట్లు వారు తెలిపారు.

కృష్ణాజిల్లాలో 78 మంది, రాష్ట్రంలో 910 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని మంత్రికి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్నినాని మాట్లాడుతూ త్వరలోనే వీటి భర్తీ ఉంటుందని వారికి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2016 నుంచి 2020 వరకు కారుణ్య నియామకాలు భర్తీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా బస్సులు తిప్పే పరిస్థితి లేదు. అయినా ఉద్యోగుల కుటుంబాల పట్ల సానుభూతితో జగనన్న ప్రభుత్వం త్వరలో కారుణ్య నియామకాలు చేపడతుందన్నారు. సర్వీస్ రూల్స్ పై తుది నిర్ణయానికి పది పదిహేను మంది ఐ ఏ ఎస్ అధికారులు ఏకాభిప్రాయానికి గత వారమే వచ్చేరని, ఆర్టీసీ ఎం డి , ప్రిన్సిపాల్ సెక్రటరీతో తనకు తదుపరి సమావేశం ఉందని అనంతరం ఆర్టీసీ త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని మంత్రి ఇచ్చిన హామీపై వారు సంతోషం వ్యక్తం చేశారు.

26 వ డివిజన్ టెక్యా ప్రాంతానికి చెందిన పలువురు మైనార్టీ మహిళలు మంత్రి వద్దకు వచ్చి తమ కష్టాన్ని ఉర్దూలో చెప్పుకొన్నారు. తమకు జగనన్న చేయూత డబ్బులు అందలేదని చెప్పారు. ” జరూర్ దాల్తే అమ్మా .. పూరా షెహర్ కో ఏక్ తరఫ్ సే ఆప్ కో మోహల్లే … ఏక్ దిన్ కి అందర్ దాల్తే .. గెరా సౌ కో ఆనా హై అంటూ మంత్రి చెప్పారు.

స్థానిక శారదానగర్ చెందిన గుర్రం మరియమ్మ అనే మహిళ తన కుమారుడు జోసెఫ్ తంబీ కొద్దిరోజుల క్రితం ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లాడని తమ పిల్లవాడిని ఒక వ్యక్తి కోడూరులో బాతులను కాపలా కాసే పనిలో పెట్టి పదివేలు సొమ్ము తీసుకోని అక్కడ నుంచి వెళ్లాడని, తాను అబ్బాయి ఆచూకీ తెల్సుకొని వెళితే, మా డబ్బులు మాకు ఇవ్వండి మీ పిల్లవాడిని వదులుతాం అని బాతులోళ్ళు బూతులు తిడుతున్నారని మంత్రి వద్ద చెప్పింది. ఈ విషయమై స్పందించిన మంత్రి పేర్ని నాని అవనిగడ్డ సర్కిల్ ఇనస్పెక్టర్ రవికుమార్ తో మాట్లాడి బాధిత తల్లికి న్యాయం చేయమని కోరారు.

ReadMore:ఐటీ పాలసీపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష