ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం..ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష

విధాత,కడప : ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా,నగర మేయర్ సురేష్ బాబులు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం కడప నగరంలోని పాత కడప, వైఎస్సార్ నగర్ కాలనీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష నగర మేయర్ సురేష్ బాబు తో కలసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఉప […]

ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే  ప్రభుత్వ లక్ష్యం..ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష

విధాత,కడప : ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా,నగర మేయర్ సురేష్ బాబులు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం కడప నగరంలోని పాత కడప, వైఎస్సార్ నగర్ కాలనీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష నగర మేయర్ సురేష్ బాబు తో కలసి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్ బాష మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని బడుగు బలహీనవర్గాల పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ధ్యేయంతో పేదలు నివసించే అన్ని ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. నేడు నగరంలోని పాత కడపలో ఒకటి, వైయస్సార్ కాలనీలో ఒకటి మొత్తం రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం సంతోషదగ్గ విషయం అన్నారు.

పాత కడప ప్రాంతంలో జరుగు రాజశేఖర్ రెడ్డి తన సొంత స్థలాన్ని ప్రాథమిక ఆరోగ్య నిర్మాణం కోసం 17 సెంట్లు వితరణ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. కడప నగరంలో తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి లో భాగంగా ఒక్కో పీ.ఎచ్.సి కి రూ.80 లక్షల రూపాయలను ఖర్చు చేయనున్నామన్నారు. ఇప్పటికే అక్కాయపల్లి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ప్రతి గ్రామం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించి ఒక ఎంబీబీఎస్ డాక్టర్,నర్సులు,మెడిసిన్, ల్యాబ్ అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. వెనుకబడిన వర్గాలు,పేదలు నివసించే ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించడం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు . రాబోవు రోజుల్లో కడప నగరంలో మరిన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో అన్ని సదుపాయాలు కల్పించి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తామన్నారు. ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్ ముంతాజ్ బేగం, 1 వ డివిజన్ కార్పొరేటర్ చిన్నయ్య,2 వ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి, 50 వ డివిజన్ ఇంచార్జ్ రాజశేఖర్, ముఖ్యనేతలు జరుగు రాజశేఖర్ రెడ్డి, బంగారు రాజు,వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం అమలులో 800 మందికి ఇంటి పట్టాల పంపిణీ

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం అమలులో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు స్థానిక మున్సిపల్ మెయిన్ ఉర్దూ పాఠశాలలో నగర మేయర్ కె.సురేష్ బాబుతో కలిసి 800 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజద్ భాష పేర్కొన్నారు.

జాయింట్ కలెక్టర్(హౌసింగ్) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్, తాసిల్దారు, మున్సిపల్ కమిషనర్, హౌసింగ్ అధికారులు, వార్డు అమెనీటిస్ సెక్రటరీలు, లబ్ధిదారులు పాల్గొనడం జరుగుతుందన్నారు. పేదల పక్షపాతి, పేద ప్రజలకు ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేయాలని నిరంతరం తపన పడే ముఖ్యమంత్రి చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.