విశాఖ ఏజెన్సీలో ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెడుతోంది

విధాత‌: విశాఖ ఏజెన్సీలో ప్రభుత్వం కులాల మధ్య చిచ్చుపెడుతోందని టీడీపీ నేత కిడారి శ్రావణ్ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ వెబ్‌సైట్‌లో గిరిజన ఉపకులం వాల్మీకి కులాన్ని తొలగించడం దారుణమన్నారు. టెక్నీకల్ ప్రాబ్లమ్‌ అంటున్న ప్రభుత్వం ఇంతవరకూ ఎందుకు సరిచేయట్లేదు? అని ప్రశ్నించారు. వాల్మీకి కులాన్ని వెబ్‌సైట్‌లో చూపించకపోవడం వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం చేస్తామని కిడారి శ్రావణ్ ప్రకటించారు.