ఏపీలో జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉంది
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డ ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి విధాత:అన్ని వర్గాల కంటే ఎక్కువుగా హింసింప బడేది జర్నలిస్టు లు మాత్రమే.అక్రిడేషన్ కమిటీలో అధికారులతో ఏర్పాటు చేయడం దుర్మార్గం.ఇదంతా ఎపి లో జగన్నాటకం మాదిరిగా కనిపిస్తుంది.రాష్ట్ర కమిషనర్, కేసు వేసిన వ్యక్తి కలిసే హైకోర్టు ను ఆశ్రయించారు. దేశంలోనే ఆదర్శమైన సంక్షేమ పధకాలు అమలు అని జగన్ గొప్పలు చెప్పుకున్నారు.మరి జర్నలిస్టు ల ప్రాణాలను , వారి కుటుంబాలకు ఆదుకునే బాధ్యత […]

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డ ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి
విధాత:అన్ని వర్గాల కంటే ఎక్కువుగా హింసింప బడేది జర్నలిస్టు లు మాత్రమే.అక్రిడేషన్ కమిటీలో అధికారులతో ఏర్పాటు చేయడం దుర్మార్గం.ఇదంతా ఎపి లో జగన్నాటకం మాదిరిగా కనిపిస్తుంది.రాష్ట్ర కమిషనర్, కేసు వేసిన వ్యక్తి కలిసే హైకోర్టు ను ఆశ్రయించారు. దేశంలోనే ఆదర్శమైన సంక్షేమ పధకాలు అమలు అని జగన్ గొప్పలు చెప్పుకున్నారు.మరి జర్నలిస్టు ల ప్రాణాలను , వారి కుటుంబాలకు ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా మాకు సంబందం లేదని చెప్పడానికి కమిషనర్ కి సిగ్గుండాలి.ఏమీ చేతకాక పోతే ఆ సీట్లో ఉద్యోగం ఎందుకు.సిఎం నుండి జిఒ ఇస్తే… సమాచార శాఖ మంత్రి పేర్ని నాని నాకు తెలియదనడం సిగ్గు చేటు.సీనియర్ జర్నలిస్టు లు హోదాలో సలహాదారులుగా ఉన్న వారు ఎందుకు మాట్లాడటం లేదు.సిఎం అంగీకరించి జిఒ ఇస్తే… అమలు చేయకపోవడం దారుణం కాదా.జర్నలిస్టు లు సలహాదారులు అయ్యాక… వైసిపి నాయకులుగా మారిపోయారా. . ఇంత దారుణమైన పరిస్థితిని దేశంలో ఎక్కడా చూడలేదు.జర్నలిస్టు ల హక్కులను కాపాడుకునేందుకు పోరాట బాట పడుతున్నాం.మాకు రాజకీయాలు ఆపాదించినా మేము పట్టించుకోం.ఈనెల17వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన పాటిస్తాం.అప్పటికీ స్పందించకుంటే రెండు రోజుల పాటు సామూహిక దీక్షలు చేస్తాం.సలహాదారులు కి సమస్యలు అర్ధమయ్యాయా… అర్ధం కానట్లు నటిస్తున్నారా… సిఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి పరిష్కారించాలని కోరుతున్నాం.. లేదంటే.. సిఎం ఇచ్చిన జిఒల నే ఎపి లో అమలు చేయడం లేదని దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తాం.సుబ్బారావు ఎపి వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు.ఎపి వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాం.ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు
ఎపి లో జర్నలిస్టు సమస్యలు, ప్రభుత్వం తీరు పై చర్చించాం.అక్రిడేషన్ల పై ఆంక్షలు, సిఎం ఇచ్చిన హామీలు, చిన్న పత్రికల సమస్యలు పై అతిధులు మాట్లాడారు.కరోనాతో చనిపోయిన జర్నలిస్టు కుటుంబ సభ్యులు కు ఐదు లక్షలు ఇస్తామని సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.నేటికీ ఒక్కరికి కూడా ఆ సాయం అందించలేదు.17వ తేదీ మా నిరసన తో అయినా ప్రభుత్వం స్పందించాలి.వీటన్నింటి పైన మరోసారి సమావేశంలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తాం.