స్వార్ధం లేకుండా పనిచేసే వారే జనసైనికులు
యువతకు పెద్దపీట వేసింది జనసేన పార్టీయే •సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకు సీట్లు ఇచ్చి ప్రోత్సహించాం•అధికారమే తప్ప కార్యకర్తల గురించి పట్టించుకున్న పార్టీ లేదు•జనసేన క్రియాశీలక కార్యకర్తలకు రూ. 5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్న ఏకైక పార్టీ జనసేన•కాకినాడలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ నమోదు,బీమా పత్రాల పంపిణీ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ విధాత:సామాన్యులు, యువతకు పెద్దపీట వేస్తేనే రాజకీయాల్లో మార్పు తీసుకురావడం సాధ్యమని నమ్మే ఏకైక నాయకుడు జనసేన అధ్యక్షులు […]

యువతకు పెద్దపీట వేసింది జనసేన పార్టీయే
•సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకు సీట్లు ఇచ్చి ప్రోత్సహించాం
•అధికారమే తప్ప కార్యకర్తల గురించి పట్టించుకున్న పార్టీ లేదు
•జనసేన క్రియాశీలక కార్యకర్తలకు రూ. 5 లక్షల ప్రమాద బీమా ఇస్తున్న ఏకైక పార్టీ జనసేన
•కాకినాడలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ నమోదు,బీమా పత్రాల పంపిణీ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్
విధాత:సామాన్యులు, యువతకు పెద్దపీట వేస్తేనే రాజకీయాల్లో మార్పు తీసుకురావడం సాధ్యమని నమ్మే ఏకైక నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్.జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకు యువతకు సీట్లు ఇచ్చి ప్రోత్సహించిన విషయం గుర్తు చేశారు.యువతకు ప్రాధాన్యం ఇస్తామని అన్ని పార్టీలు మాటల్లో చెబితే … జనసేన మాత్రమే చేతల్లో చేసి చూపిందని చెప్పారు. కాకినాడలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ నమోదు,బీమా పత్రాలను అందచేశారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “క్రియాశీలక సభ్యత్వం కోసం గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు సంక్షేమ పథకాలు తీసేస్తామని అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఎదురైనా,వాటిని తట్టుకొని లక్షల్లో సభ్వత్వాలు నమోదు చేశారు.ముఖ్యంగా కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గంల్లో కలిసి 5 వేలకు పైగా సభ్వత్వాలను నమోదు చేశారు.ఒక వైపు కోవిడ్ పరిస్థితులు ఇబ్బందిపెట్టినా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.క్రియాశీలక సభ్యత్వం కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన జన సైనికులకు పవన్ కళ్యాణ్ తరపున అభినందిస్తున్నాను.
వాళ్లకు ఆస్తుల పెంపుపైనే ఆశ
కొన్ని పార్టీలు సంవత్సరాల పాటు అధికారం అనుభవించినా కార్యకర్తల గురించి పట్టించుకోలేదు. పదవులు అనుభవించారు, కుటుంబ ఆస్తులను పెంచుకున్నారు తప్ప కార్యకర్తలను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. కానీ జనసేన పార్టీ మాత్రం కార్యకర్తకు అండగా ఉండాలనే క్రియాశీలక సభ్యత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశంలో ఏ పార్టీ ఇవ్వని విధంగా రూ. 5 లక్షల ప్రమాద బీమాను అందిస్తోంది. ఏదైనా క్లయిమ్ రావాలంటే ఏడెనిమిది నెలలు పడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఇన్సురెన్సు కంపెనీలతో మాట్లాడి 21 రోజుల్లోనే క్లయిమ్ వచ్చే విధంగా చేస్తున్నారు.
రూపాయికి ఇంకో రూపాయి కలిపి ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్
రాజకీయాల్లోకి చాలామంది వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల పిల్లలు వచ్చారు.వేలకోట్లు సంపాధించారు.అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాత్రం ఆయనకు రూపాయి వస్తే దానికి ఇంకో రూపాయి కలిపి ప్రజలకు ఖర్చు చేసే మంచి మనసున్న వ్యక్తి. క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు కార్యకర్తల కోసం ఆయన వ్యక్తిగత సంపాదన నుంచి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఏ రాజకీయ పార్టీ మనుగడకు అయినా గెలుపే ముఖ్యం. ఆ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని కష్టపడాలి.
పాదయాత్ర చేసేటప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి అనేక వాగ్ధానాలు చేశారు.ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి ఏ విధంగా తవ్వుకొని దోచుకుంటున్నారో అందరికీ తెలిసిన విషయమే.సామాన్యులు కోరుకునేది విద్య, ఉపాధి, ఆరోగ్యం. ముఖ్యంగా యువతను జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేశారు. యువతకు అండగా నిలబడటం కోసం జిల్లా ఉపాధి కార్యాలయాల్లో వినతిపత్రం ఇవ్వాలనే కార్యక్రమాన్ని చేపడితే దానిని పోలీసు యంత్రాంగం బలంతో అణిచివేయాలని చూశారు. మన గ్రామాలు, మండలాల్లో చాలా సమస్యలు ఉంటాయి. వాటిని గుర్తించి వాటిని పార్టీ దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడాలి. ఈ నెలలో పెద్ద ఉద్యమం ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం అయితే కోవిడ్ పరిస్థితుల్లో జనసైనికులను ఇబ్బంది పెట్టడం కరెక్టు కాదని ఆలోచించి దానిని వచ్చే నెలకు వాయిదా వేశాం. పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు అవకాశం కల్పించే విధంగా పార్టీ నిర్మాణం ఉంటుందని హామీ ఇచ్చారు.
ఏ స్వార్ధం లేకుండా పనిచేసే వారే జనసైనికులు :
తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మాట్లాడుతూ “రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ,నాదెండ్ల మనోహర్ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజకీయాలు అంటే మాటలు చెప్పడం కాదు, కార్యకర్తలకు అండగా ఉండటమని వాళ్లిద్దరు చాటి చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వారికి ఎమ్మెల్యేలు, మంత్రులు అవ్వాలనే స్వార్ధం ఉంటుంది. కానీ ఏ స్వార్ధం లేకుండా పవన్ కళ్యాణ్ ని అత్యున్నత స్థాయిలో నిలబెట్టాలనే ధ్యేయంతో నిస్వార్ధంతో పనిచేస్తున్న వారు కేవలం జనసైనికులు మాత్రమే. వారి సంపూర్ణ భాగస్వామ్యం,కృషితోనే ఇన్ని లక్షల సభ్యత్వం నమోదయ్యింది. తూర్పు నుంచే మార్పు మొదలైంది.జనసేన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని రాష్ట్ర ప్రజలందరికి తెలిసే రోజు త్వరలోనే ఉంద”ని అన్నారు.
కార్యకర్తలకు అండగా ఉండేదుకే
పి.ఏ.సి. సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ “కార్యకర్తలకు అండగా నిలబడాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. దేశంలో ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు రూ. 5 లక్షల ప్రమాద బీమా అందిస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా క్షేత్రస్థాయిలో వెళ్లి సభ్యత్వం నమోదు చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు” అన్నారు. పి.ఏ.సి. సభ్యులు ముత్తా శశిధర్ మాట్లాడుతూ “కార్యకర్తల యోగక్షేమాల గురించి చి ఇప్పుడు ఆలోచించే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా మన పార్టీ పట్ల ప్రజలు ఎంత అభిమానం, విశ్వాసం చూపుతున్నారో అర్థమైంది” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బొమ్మడి నాయకర్,తుమ్మల బాబు,శెట్టిబత్తుల రాజబాబు,పి.సరోజ, సుంకర కృష్ణవేణి, వాసిరెడ్డి శివ,భోగిరెడ్డి గంగాధర్,టి.వీరబాబు తదితరులు పాల్గొన్నారు.