నేడు ఇడుపులపాయకు సీఎం జగన్
విధాత:దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం ఇడుపులపాయ రానున్నారు. సాయంత్రం 3 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3.30కు ప్రత్యేక విమానంలో బయలుదేరి 4.20కి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని ప్రత్యేక హెలికాప్టరులో బయల్దేరి 4.30కు ఇడుపులపాయ చేరుకుంటారు. 4.50కి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 4.50 నుంచి 5.50 వరకు పార్టీ కార్యకర్తలతో మాట్లాడతారు. 2వ తేదీ ఉదయం […]

విధాత:దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం ఇడుపులపాయ రానున్నారు. సాయంత్రం 3 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3.30కు ప్రత్యేక విమానంలో బయలుదేరి 4.20కి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని ప్రత్యేక హెలికాప్టరులో బయల్దేరి 4.30కు ఇడుపులపాయ చేరుకుంటారు. 4.50కి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 4.50 నుంచి 5.50 వరకు పార్టీ కార్యకర్తలతో మాట్లాడతారు. 2వ తేదీ ఉదయం 9.30కి గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 9.30 నుంచి 10.05 వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 10.15 నుంచి పార్టీ కార్యకర్తలతో మాట్లాడతారు. 11 గంటలకు బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని ప్రత్యేక విమానంలో 11.30కు బయలుదేరి గన్నవరం చేరుకుంటారు. 12.45కు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళతారు.