వివేకా హత్ కేసు: హత్యకు ముందురోజు రాత్రి వివేకాను ఇంట్లో దిగబెట్టింది ఆయనే!
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. దాదాపు 20 రోజులుగా అనుమానితులపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ కేసు దర్యాప్తు మొత్తం వివేకాకు అత్యంత సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి చుట్టే తిరగడం విశేషం. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను వరుసగా ఐదురోజుల పాటు విచారించారు. ఆయనతోపాటు మరో ఇద్దరిని, వివేకాకు సన్నిహితంగా ఉండే మరో కుటుంబ సభ్యులపై సీబీఐ ప్రశ్నలు సంధిస్తోంది. ★ మాజీమంత్రి వివేకా హత్యకేసులో ఆయనకు అత్యంత […]

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది.
- దాదాపు 20 రోజులుగా అనుమానితులపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
- ఈ కేసు దర్యాప్తు మొత్తం వివేకాకు అత్యంత సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి చుట్టే తిరగడం విశేషం.
- వివేకా కుమార్తె సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన్ను వరుసగా ఐదురోజుల పాటు విచారించారు.
- ఆయనతోపాటు మరో ఇద్దరిని, వివేకాకు సన్నిహితంగా ఉండే మరో కుటుంబ సభ్యులపై సీబీఐ ప్రశ్నలు సంధిస్తోంది.
★ మాజీమంత్రి వివేకా హత్యకేసులో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారిపైనే ఎక్కువగా దృష్టిసారించింది.
★ ఆయనకు 40 ఏళ్లుగా సన్నిహితంగా మెలిగిన తుమలపల్లి గంగిరెడ్డి అలియాస్ ఎర్రగంగిరెడ్డి చుట్టూనే కేసు దర్యాప్తు సాగుతోంది.
★ వివేకా కుమార్తె హైకోర్టులో వేసిన పిటిషన్‌లో అనుమానితుల జాబితాలో ఎర్ర గంగిరెడ్డి పేరు రెండోది.
★ ఈ నేపథ్యంలో ఈనెల 7న మూడోవిడత దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. వరుసగా ఐదురోజుల పాటు ఎర్రగంగిరెడ్డిని విచారించింది.
★ వివేకా మృతి విషయం తెలిసిన తర్వాత ఆయన ఇంటికి మొదటిగా వచ్చిన 16 మందిలో గంగిరెడ్డి ఒకరు.
★ హత్య జరగడానికి ముందురోజు ఎన్నికల ప్రచారం ముగించుకుని వచ్చిన తర్వాత వివేకాను రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వద్ద దింపింది కూడా ఎర్రగంగిరెడ్డే.
★ వివేకా కుమార్తె హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో గంగిరెడ్డిపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది.
★ హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు, ఇతర ఆధారాలు అన్నీ తుడిచేసింది ఎర్రగంగిరెడ్డేనని.. వైఎస్ మనోహర్‌రెడ్డి చెబితేనే తాను ఆ పని చేశానని గతంలో పోలీసు కస్టడిలోనే ఆయన ఒప్పుకున్నారన్నారు.
★ గంగిరెడ్డికి తామంతా ఎంతో పరిచయం ఉన్నా.. తమ తండ్రి చనిపోయారన్న విషయం కనీసం మాకు తెలపలేదని, మీడియాలో వస్తున్న వార్త చూసి తాము ఆయనకు ఫోన్ చేసినా స్పందించలేదని సునీత పిటిషన్‌లో పేర్కొన్నారు.
★ భార్య, కుమార్తె లేకుండానే హడావుడిగా వివేకా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు.
★ మృతదేహాం రక్తమడుగులో ఉండటంతోపాటు గాయాల ఆనవాళ్లు కనిపిస్తున్నప్పటికీ.. గుండెపోటుతో మరణించారంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారన్నారు.
★ మృతి ఘటనపై కేసు నమోదు చేయవద్దంటూ అప్పటి పోలీసులపై గంగిరెడ్డి ఒత్తిడి తెచ్చారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు.
★ 2019 జులై 29 నుంచి ఆగస్టు 23 మధ్య గుజరాత్‌లో గంగిరెడ్డికి పాలీగ్రాఫ్, నార్కో ఎనాలసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షల్లో రాబట్టిన వివరాల ఆధారంగా ఆయన్ను మరోసారి సీబీఐ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
★ ఎర్రగంగిరెడ్డితోపాటు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి, పీఏ ఇనయాతుల్లాతోపాటు వివేకాతో సన్నిహితంగా మెలిగే కృష్ణయ్యయాదవ్ కుటుంబ సభ్యులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.