కృష్ణా జలాల వివాదాన్నీ ‘సభ’లో ప్రస్తావిస్తాం

విధాత‌: ఈ నెల 19 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైసీపీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు హాజరయ్యారు. సమావేశం అనంతరం సహచర సభ్యులతో కలసి వైసీపీపీ నేత వి.విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని చెప్పారు. ‘‘ప్రత్యేక హోదా కోసం వైసీపీపీ తొలి నుంచి పోరాడుతోంది. పోలవరం సవరించిన […]

కృష్ణా జలాల వివాదాన్నీ ‘సభ’లో ప్రస్తావిస్తాం

విధాత‌: ఈ నెల 19 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైసీపీపీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు హాజరయ్యారు. సమావేశం అనంతరం సహచర సభ్యులతో కలసి వైసీపీపీ నేత వి.విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని చెప్పారు. ‘‘ప్రత్యేక హోదా కోసం వైసీపీపీ తొలి నుంచి పోరాడుతోంది. పోలవరం సవరించిన అంచనాల గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తాం. పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌ నిధుల అంశాన్నీ లేవనెత్తుతాం. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిలోకి తీసుకురావాలని కోరుతాం. తెలంగాణ ప్రభుత్వం కృష్ణాపై నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులనూ పార్లమెంటులో ప్రస్తావిస్తాం’’ అని తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ.6,112 కోట్లు విద్యుత్‌ బకాయీల గురించీ ప్రస్తావిస్తామని చెప్పారు. గిరిజన వర్సిటీని నాన్‌ ట్రైబల్‌ ఏరియాలో ప్రతిపాదించారని, దానిని సాలూరులో పెట్టాలని కోరుతామని చెప్పారు.