అభివృద్ధి అజెండాగా ముందుకెళతాం…
రూ340 .6 కోట్ల నిధులుతో భూగర్భ డ్రైనేజీ పనులు, అదనపు నీటి పథకం, సుందరీకరణ పనుల ప్రారంభోత్సవంలో ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి కృషి… సీఎం సహకారంతోనే రాయచోటి అభివృద్ధి- ఎమ్మెల్సీ జకియా ఖానం. విధాత: రాయచోటి పట్టణం, గ్రామీణ ప్రాంతాల అభివృద్దే అజెండగా ముందుకు వెళతామని ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం రాయచోటి పట్టణంలో రూ 240 కోట్లు నిధులుతో భూగ్సర్భ డ్రైనేజీ, రూ 6.6 కోట్లు నిధులుతో […]

- రూ340 .6 కోట్ల నిధులుతో భూగర్భ డ్రైనేజీ పనులు, అదనపు నీటి పథకం, సుందరీకరణ పనుల ప్రారంభోత్సవంలో ప్రభుత్వ చీఫ్ శ్రీకాంత్ రెడ్డి.
- శ్రీకాంత్ రెడ్డి కృషి… సీఎం సహకారంతోనే రాయచోటి అభివృద్ధి- ఎమ్మెల్సీ జకియా ఖానం.
విధాత: రాయచోటి పట్టణం, గ్రామీణ ప్రాంతాల అభివృద్దే అజెండగా ముందుకు వెళతామని ప్రభుత్వ చీఫ్ విప్ జి.శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం రాయచోటి పట్టణంలో రూ 240 కోట్లు నిధులుతో భూగ్సర్భ డ్రైనేజీ, రూ 6.6 కోట్లు నిధులుతో సుందరీకరణ పనులు, రూ 98 కోట్లతో రాయచోటి పట్టణానికి వెలిగల్లు నుంచి అదనపు నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ జకియాఖానమ్, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిలతో కలిసి శ్రీకాంత్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురైన రాయచోటిని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామన్నారు. ఇప్పటికే రాయచోటిలో మహిళా డిగ్రీ కళాశాల మంజూరుతో పాటు అందుకు అవసరమైన సిబ్బంది నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. పి.జి సెంటర్ ఏర్పాటుకు కూడా వచ్చే క్యాబినెట్ లో ఆమోదం లభిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. నూతన పోలీసు స్టేషన్ల ఏర్పాటు, ఫార్కుల నిర్మాణం, టిటిడి కళ్యాణ మండపంతో పాటు ఆలయం, ఫార్కు నిర్మాణాన్ని చేపట్టేలా హామీ లభించిందన్నారు. ఇక తాగునీరు, రోడ్లు విస్తరణు తదితర పనులకు కావాల్సినన్ని నిధులను సిఎం అడిగిన వెంటనే అందజేస్తున్నారన్నారు. అందరి సహకారంతో సుందరమైన పట్టణాన్ని నిర్మించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేయిస్తామన్నారు. ఎమ్మెల్సీ జకియాఖానమ్ మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషిని ప్రశంసించారు. అభివృద్ధి పనుల కోసం సీఎంను ఒప్పించి నిధులను రాబట్టడంలో సిద్ధహస్తుడన్నారు. ఆయన నేతృత్వంలోనే పట్టణం అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధిస్తుందన్నారు. కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు, మున్సిపల్ కమీషనర్ రాంబాబు, పార్టీ సీనియర్ నాయకులు వండాడి వెంకటేశ్వర్లు, హబీబుల్లాఖాన్, బేపారి మహమ్మద్ ఖాన్, కౌన్సిలర్లు అసీస్ఎలీఖాన్, ఫయాజుర్ రెహమాన్, మదనమోహన్ రెడ్డి, ఈశ్వరప్రసాద్, శ్యామ్, కొలిమి హారూన్, చానా బాషా, జయన్న నాయక్, అల్తాఫ్, సలీం, కె.వి.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.