నాలుగు నెలలుగా వేతనాల్లేవ్‌

విధాత‌: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో(జీపీఎస్‌) పనిచేసే ఒప్పంద గురుకుల ఉపాధ్యాయుల(సీఆర్టీ) సర్వీసు పునరుద్ధరణలో విపరీత జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది మే నెలలోనే రెన్యువల్‌ పూర్తవ్వాల్సి ఉన్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో 1,798 మంది ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. రెన్యువల్‌కు సంబంధించిన దస్త్రం దాదాపు రెండు నెలలుగా ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జీతాల్లేక అప్పు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని […]

నాలుగు నెలలుగా వేతనాల్లేవ్‌

విధాత‌: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో(జీపీఎస్‌) పనిచేసే ఒప్పంద గురుకుల ఉపాధ్యాయుల(సీఆర్టీ) సర్వీసు పునరుద్ధరణలో విపరీత జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది మే నెలలోనే రెన్యువల్‌ పూర్తవ్వాల్సి ఉన్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో 1,798 మంది ఉద్యోగులకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. రెన్యువల్‌కు సంబంధించిన దస్త్రం దాదాపు రెండు నెలలుగా ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జీతాల్లేక అప్పు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.