వరద బాధితులే తనను ఓదార్చాలనుకుంటున్నాడు చంద్రబాబు: విజయసాయిరెడ్డి
విధాత: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు ప్రదర్శించిన తీరు బాగోలేదని ఆయన అన్నారు."గాల్లో కలిసిపోతారని సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వక్రబుద్ధి ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదు. వరద ప్రాంతాల పర్యటనలో తన భార్య గురించి మాట్లాడి 'మనిషివా చంద్రబాబు' అనే పరిస్థితి తెచ్చుకున్నాడు. తానే బాధల్లో ఉన్నానని, వరద బాధితులే తనను ఓదార్చాలనుకుంటున్నాడు" అని విజయసాయిరెడ్డి […]

విధాత: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు ప్రదర్శించిన తీరు బాగోలేదని ఆయన అన్నారు.
“గాల్లో కలిసిపోతారని సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వక్రబుద్ధి ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదు. వరద ప్రాంతాల పర్యటనలో తన భార్య గురించి మాట్లాడి ‘మనిషివా చంద్రబాబు’ అనే పరిస్థితి తెచ్చుకున్నాడు. తానే బాధల్లో ఉన్నానని, వరద బాధితులే తనను ఓదార్చాలనుకుంటున్నాడు” అని విజయసాయిరెడ్డి విమర్శల వర్షం గుప్పించారు.